ధనుష్ యాక్టర్ గా తన 50 మైల్ స్టోన్ మూవీ ‘రాయన్’కి దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ ఇతర లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. జూలై 26న రాయన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరో సందీప్ కిషన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ – రాయన్ మా పాత్ర గురించి అసలు చెప్పకూడదు. అది స్క్రీన్ పైనే చూడాలి. నా క్యారెక్టర్ కి వున్న వెయిటేజీ గురించి చెప్పాలంటే- ధనుష్ అన్న తన కోసం రాసుకున్న క్యారెక్టర్ ని నాకు ఇచ్చారు. ఇదే ఒక బెస్ట్ కాంప్లీమెంట్ గా భావించాను. ఇప్పటివరకూ నేను చేయని క్యారెక్టర్. నా పెర్ఫార్మెన్స్ కి చాలా మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. క్యారెక్టర్ ఎంటర్ టైనింగ్ గా వుంటుంది. ఎమోషనల్ యాంగిల్స్ కూడా చాలా ఎక్కువ వుంటాయి. యాక్షన్ కూడా వుంటుంది. క్యారెక్టర్ సీరియస్ గా వుంటుంది చూసినపుడు ఫన్నీ గా అనిపిస్తుంది.
చదవండి: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ‘ఇంద్ర’ గ్రాండ్ రీ-రిలీజ్
చాలా ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నాను. కథ గురించి ఇప్పుడు ఏ మాత్రం చెప్పకూడదండీ. ఇన్ఫాక్ట్.. ధనుష్ పెద్దన్న, నేను రెండో వాడిని, మూడో వాడు కాళిదాస్, ఒక చెల్లి. ఇదే ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ గురించే కథ. స్క్రీన్ ప్లే పరంగా చాలా కొత్తగా వుంటుంది, ప్రతి క్యారెక్టర్ కి ఐడెంటిటీ వుంటుంది. తీయడానికి చాలా టఫ్ ఫిల్మ్ ఇది. తొంబై రోజులు షూటింగ్, నేను 75 రోజులు చేశా. నాకొక టఫ్ షూటింగ్ ఎక్స్ పీరియన్స్. యాక్షన్ సీన్ లో సోల్డర్ ఇంజురీ కూడా అయ్యింది. గ్రీజ్ పూసుకుని సెట్ కి వెళ్ళేవాడిని.(నవ్వుతూ) దాదాపు ఇరవై కిలోమీటర్ల సెట్ లో వేరే వేరే లోకేషన్స్ లో షూటింగ్ జరిగేది. ఇది చాలా కొత్త ఎక్స్ పీరియన్స్, ధనుష్ అన్న కూడా డైరెక్టర్ గా వెరీ టఫ్.
కృష్ణవంశీ, దేవాకట్టా, రాజ్ డీకే లతో ఎలాంటి ఒక ఎక్స్ పీరియన్స్ ఫీలయ్యాని రాయన్ కూడా అలాంటి ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. యాక్టర్ గా నేర్చుకోవడానికి చాలా స్కోప్ దొరికింది. నేను కానీ అపర్ణ కానీ ఇందులో ఎవరైనా ధనుష్ అన్న విజన్ కి తగ్గట్టుగా పని చేశాం. ధనుష్ గారి డైరెక్షన్ చేయడం అరుదైన అవకాశంగా భావిస్తున్నాను. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నక్కిన త్రినాధ రావు గారితో ఒక సినిమా జరుగుతోంది. ఇది నా 30వ సినిమా. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అలాగే మయావన్ సినిమా కూడా జరుగుతోంది. ఇది సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో టైప్ సినిమా. అలాగే రాహుల్, స్వరూప్ తో వైబ్ చేస్తున్నాను. ఇది కూడా చాలా ఎక్సయిటింగ్ గా వుంటుంది. అన్నారు.