సుహాస్ హీరోగా నటిస్తున్న “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది శివాని నాగరం. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీ హైలైట్స్ చెప్పింది హీరోయిన్ శివాని నాగరం.
– “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” లాంటి మంచి మూవీతో టాలీవుడ్ లో అడుగుపెడుతుండటం అదృష్టంగా భావిస్తున్నా. ఒక పెద్ద బ్యానర్ లో మంచి టీమ్ ఉన్న సినిమాతో పరిచయం కావడం హ్యాపీగా ఉంది. ఎగ్జైటింగ్ గా, నెర్వస్ నెస్ కూడా ఫీలవుతున్నా. నేను ఈ సినిమా చూశాను కాబట్టి కాన్ఫిడెంట్ గా ఉన్నా… మీరంత చూసి ఇచ్చే రెస్పాన్స్ కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నా. ఒక పెద్ద సినిమాలో యాక్టర్స్ గా మాకూ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ బాధ్యతతో నెర్వస్ నెస్ అనిపిస్తోంది. మా టీమ్ అంతా పూర్తిగా పాజిటివ్ గా ఉన్నాం. మాది హైదరాబాద్. ఈ సినిమా కోసం ఫస్ట్ టైమ్ మరో ఊరికి వెళ్లాను. షూటింగ్ అంతా హ్యాపీగా జరిగింది. 75 రోజుల పాటు అమలాపురం, అంబాజీపేట ..ఆ ప్రాంతంలో ఉన్నాం. లోకల్ గా ఉన్న బ్యుటిఫుల్ వెదర్, ప్లెజంట్ అట్మాస్మియర్ ను ఎంజాయ్ చేశాం. అక్కడి వారు కూడా చాలా లవ్ చూపిస్తారు. వాళ్ల ఇంటికి భోజనానికి పిలిచేవారు. వెళ్లకుంటే వాళ్లకు కోపం కూడా వచ్చేది. ఈ మూవీలో నా క్యారెక్టర్ కు స్పెషల్ గా యాస ఏదీ ఉండదు. మామూలు తెలుగులోనే మాట్లాడుతుంటా. ఒక్కడో ఒక దగ్గర స్లాంగ్ తో డైలాగ్ చెప్పమనేవారు.
– ఈ సినిమాలో అవకాశం నాకు ఆడిషన్ ద్వారానే వచ్చింది. ఇన్ స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ పంపారు. నేను హీరోయిన్ ఫ్రెండ్ రోల్ కోసం ఆడిషన్ అని వెళ్లాను. అయితే ఆడిషన్ తీసుకున్న తర్వాత హీరోయిన్ గానే తీసుకుంటున్నాం అని చెప్పారు. ఫస్ట్ డే షూట్ చేసే వరకు నేనే హీరోయిన్ అనేది నమ్మలేకపోయాను. ఒక మంచి స్క్రిప్ట్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుండటం లక్కీగా అనిపించింది. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” లో నా క్యారెక్టర్ పేరు లక్ష్మి. ఇందులో కొన్ని ఎమోషనల్ సీన్స్ చేయడం ఛాలెంజింగ్ గా ఉండేది. అయితే మేము షూటింగ్ కు ముందు నెల రోజుల పాటు బాగా ప్రిపేర్ అయ్యాను. ప్రతి డైలాగ్ నేర్చుకున్నా. సీన్స్ ఇంకా పర్పెక్ట్ గా చేయాలని ఉండేది. ఈ ప్రిపరేషన్ వల్ల సెట్ లో నటించడం కష్టమనిపించలేదు. రియల్ లైఫ్ లో నేను కూచిపూడి డ్యాన్సర్ ని. పిల్లలకు సంగీతం నేర్పిస్తుంటా. అయితే ఈ సినిమాలో పాట పాడటం, డ్యాన్సులు చేయడానికి అవకాశం దొరకలేదు. నెక్ట్ ఫిలింలో ట్రై చేస్తా. యాక్టింగ్ గురించి మొదట్లో తెలియదు. ట్రైనింగ్ తీసుకున్నా.
– సుహాస్ కలర్ ఫొటో మూవీకి నేషనల్ అవార్డ్ దక్కింది. ఆయనతో వర్క్ చేయడం హ్యాపీగా, కంఫర్ట్ గా ఉండేది. కో యాక్టర్స్ చేసే పర్ ఫార్మెన్స్ మన మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అలా సుహాస్ ను చూసి మేము ఇంకా బాగా నటించేవాళ్లం. నాకు డెబ్యూ మూవీ కాబట్టి సుహాస్ నుంచి మంచి సపోర్ట్ దొరికింది. ప్రతిభ గల తెలుగు అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. వాళ్లందరికీ మంచి అవకాశాలు రావాలి. ఆ ప్రాజెక్ట్స్ సక్సెస్ కావాలి. అప్పుడే మన టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు ఇంకా గుర్తింపు దక్కుతుంది. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. తెలుగు అమ్మాయిలు తెలుగు సినిమాల్లో నటిస్తే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒక డైలాగ్ మార్చి సెట్ లో నాకు ఇస్తే భాష తెలుసు కాబట్టి వెంటనే చెప్పగలను. అదే మరో భాష నటి అయితే అర్థం చేసుకుని నటించేందుకు టైమ్ పడుతుంది. తెలుగు అమ్మాయిలే హీరోయిన్స్ అయితే షూటింగ్ త్వరగా చేసుకోవచ్చు. డైరెక్టర్ దుశ్యంత్ గారు “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” కథలో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇందులో సుహాస్ తో పాటు నేను చేసిన లక్ష్మీ క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే శరణ్య గారి పాత్ర బాగుంటుంది. విలన్ క్యారెక్టర్ కూడా కీలకంగా సాగుతుంది. రైటింగ్ పరంగా ఈ సినిమాలో అందరికీ మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. ప్రతి క్యారెక్టర్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. శరణ్య గారితో నాకు సీన్స్ లేవు. ఈ కథ గురించి నేను ఎక్కువగా రివీల్ చేయలేను. సినిమాలోనే చూడాలి.
– హీరోయిన్ గానే కాదు కథలో కీలకంగా ఉండి నటిగా ప్రతిభ చూపించే అవకాశం ఉండే క్యారెక్టర్స్ కూడా చేయాలనుకుంటున్నాను. అవి కథలో అలా వచ్చి వెళ్లేవి కాకుండా ఇంపాక్ట్ ఉండే రోల్స్ అయితే ఓకే చెప్తా. ఏపీలో “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ప్రమోషనల్ టూర్ చేశాం. వైజాగ్, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి వంటి ప్రాంతాలకు వెళ్లాం. అక్కడి ప్రజలు చూపించిన అభిమానం మర్చిపోలేము. ఎంతో లవ్ చూపించారు. మా సినిమా టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి ట్రైలర్ బాగా కట్ చేయాలనే ప్రెజర్ ఉండేది. ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 4.4 మిలియన్ వ్యూస్ “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ట్రైలర్ దక్కించుకుంది. ట్రైలర్ రిలీజ్ లో ఆడియెన్స్ నా మీద చూపించిన అభిమానం నమ్మలేకపోయా. సినిమాలో నేను చేసిన లక్ష్మీ క్యారెక్టర్ కు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నా. ఈ మూవీలో గుమ్మా అనే సాంగ్ నా ఫేవరేట్ సాంగ్. ఈ సినిమా రిలీజ్ అయ్యాకే నా కొత్త ప్రాజెక్ట్ కు సైన్ చేయాలనుకున్నాను. కొన్ని ఆఫర్స్ వచ్చాయి గానీ ఇప్పటిదాకా మరే మూవీ ఒప్పుకోలేదు. సావిత్రి, శ్రీదేవి, కమల్ హాసన్, రజనీకాంత్, అల్లు అర్జున్, నాని, సుహాస్…వీళ్లంతా నా ఫేవరేట్ యాక్టర్స్.