నాగార్జున హీరోగా నటించిన నా సామి రంగ సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా రన్ అవుతోంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల కిందట రిలీజైంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ బాగున్నాయని మూవీ టీమ్ చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల రూపాయలు వరల్డ్ వైడ్ గా 24 కోట్ల రూపాయల వసూళ్లు ఈ సినిమాకు దక్కాయి. బిజినెస్ పరంగా చూస్తే బ్రేక్ ఈవెన్ కు ఈ సినిమా చేరినట్లే అని టాక్ వినిపిస్తోంది.
మలయాళ హిట్ మూవీ రీమేక్ గా దర్శకుడు విజయ్ బిన్నీ ఈ సినిమాను రూపొందించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ సంస్థ నిర్మించింది. నాగార్జునతో పాటు రాజ్ తరుణ్, అల్లరి నరేష్, రుక్సర్ థిల్లాన్ తదితరులు కీ రోల్స్ చేశారు. ఓల్డ్ నెరేషన్ స్టైల్ వల్ల నా సామి రంగ సినిమా ఈ జెనరేషన్ ఆడియెన్స్ ను పెద్దగా మెప్పించలేకపోయింది. సంక్రాంతి హాలీడేస్ కాబట్టి సినిమా ఎలాగోలా లాక్కొచ్చింది. ఈ వారం నుంచి థియేటర్స్ లో నా సామి రంగ సినిమా నిలబడాల్సిఉంది.