రూటు మార్చిన చైతన్య

Spread the love

నాగచైతన్య హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా.. గ్యాప్ ఎక్కువ తీసుకోకుండా సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ లో 15 ఇయర్స్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాడు. ప్రస్తుతం తండేల్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. తండేల్ డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే.. ఈ 15 ఇయర్స్ ఎక్స్ పీరియన్స్ తో ఇప్పుడు రూటు మార్చాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. చైతూ రూటు మార్చి ఏం చేయబోతున్నాడు..?

జోష్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. తొలి సినిమాతో నటుడుగా మెప్పించినా.. కమర్షియల్ సక్సెస్ మాత్రం రాలేదు. ఆతర్వాత చేసిన ఏమాయచేశావే సినిమాతో సక్సెస్ సాధించి యూత్ కి దగ్గరయ్యాడు. సుకుమార్ డైరెక్షన్ లో చేసిన 100 పర్సెంట్ లవ్ కూడా చైతన్యకు మంచి విజయాన్ని అందించింది. అయితే.. మాస్ ని మెప్పించాలని చేసిన దడ, బెజవాడ సినిమాలు మాత్రం ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి. తడాఖా, మనం, ఒక లైలా కోసం.. ఇలా విభిన్న కథా చిత్రాలతో మెప్పిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుకున్నాడు నాగచైతన్య.

చదవండి: మోక్షజ్ఞను పరిచయం చేసిన ప్రశాంత్ వర్మ

మాస్ మూవీస్ తో మెప్పించాలని చేసిన ప్రయత్నాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి. అయినప్పటికీ చైతన్య ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. 15 సంవత్సరాల కెరీర్ లో ఎన్నో విభిన్న పాత్రలతో ఆకట్టుకుని గుడ్ ఫర్ ఫార్మర్ అనిపించుకున్నాడు. ఇప్పుడు చందు మొండేటి డైరెక్షన్ లో తండేల్ చేస్తున్నాడు. నాగచైతన్య, చందు మొండేటి కలిసి ప్రేమమ్, సవ్యసాచి చిత్రాలు చేశారు. ఇందులో ప్రేమమ్ సక్సెస్ అయ్యింది.. సవ్యసాచి ప్లాప్ అయ్యింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మూడో సినిమా చేస్తుండడం.. ఇది పాన్ ఇండియా మూవీ కావడం.. కథానాయికగా సాయిపల్లవి కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆమధ్య రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో సినిమా పై మరింతగా క్యూరియాసిటీని పెంచేసింది.

చైతూ నెక్ట్స్ మూవీ విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో చేయనున్నారు. కార్తీక్ దండు విరూపాక్ష సీక్వెల్ చేస్తాడనుకున్నారు కానీ.. చైతూ కోసం డిఫరెంట్ స్టోరీ రెడీ చేయడం.. ఆ స్టోరీ చైతూకి నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అక్టోబర్ లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. తండేల్ మూవీని పాన్ ఇండియా మూవీగా చేస్తోన్న చైతన్య కార్తీక్ దండుతో చేసే మూవీని కూడా పాన్ ఇండియా మూవీగా చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇప్పటి వరకు తెలుగు వరకు పరిమితం అయ్యే సినిమాలే చేసిన చైతూ ఇప్పుడు రూటు మార్చి పాన్ ఇండియా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడట. కథల విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నాడు. అందుకనే ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఒప్పుకోవడం లేదట. ఒక సినిమా అయినా తర్వాతే మరో సినిమా అనేట్టుగా పక్కా ప్లానింగ్ తో.. క్యారెక్టర్ కోసం ఎక్కువ హామ్ వర్క్ చేస్తున్నాడట. మరి.. రూటు మార్చిన చైతూ ఇక నుంచి పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.

Hot this week

నాకు వచ్చిన అవార్డు రాబోయే తరాలకు స్ఫూర్తి : రిషబ్‌శెట్టి

నాకు వచ్చిన అవార్డు రాబోయే తరాలకు స్ఫూర్తి నేషనల్ అవార్డు అందుకున్న కాంతారా...

జమ్మూకశ్మీర్‌లో పాగా వేసిన కూటమి..!

జమ్మూకశ్మీర్‌లో పాగా వేసిన కూటమి..! రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ..!జమ్మూ కశ్మీర్...

హరియాణాలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ..!

హరియాణాలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ..!వరసుగా రెండు పర్యాయాలు గెలిచి హరియాణలో సర్కారు...

నాంపల్లి కోర్టులోఅక్కినేని ఫ్యామిలీ ..నాగార్జునపై పరువునష్టం దావా వేస్తాం !!

నాంపల్లి కోర్టులో మంత్రి కొండాపై ‘పరువునష్టం’ విచారణ వాంగ్మూలం ఇచ్చిన నాగార్జున, సుప్రియరాజకీయ...

జానీమాస్టర్‌కి ఒక రూల్‌..యడ్యూరప్పకు మరో రూలా..?

జానీమాస్టర్‌ అవార్డును రద్దు చేసిన కేంద్రం..! కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన కర్ణాటక కాంగ్రెస్‌..!ప్రముఖ...

Topics

నాకు వచ్చిన అవార్డు రాబోయే తరాలకు స్ఫూర్తి : రిషబ్‌శెట్టి

నాకు వచ్చిన అవార్డు రాబోయే తరాలకు స్ఫూర్తి నేషనల్ అవార్డు అందుకున్న కాంతారా...

జమ్మూకశ్మీర్‌లో పాగా వేసిన కూటమి..!

జమ్మూకశ్మీర్‌లో పాగా వేసిన కూటమి..! రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ..!జమ్మూ కశ్మీర్...

హరియాణాలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ..!

హరియాణాలో హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ..!వరసుగా రెండు పర్యాయాలు గెలిచి హరియాణలో సర్కారు...

నాంపల్లి కోర్టులోఅక్కినేని ఫ్యామిలీ ..నాగార్జునపై పరువునష్టం దావా వేస్తాం !!

నాంపల్లి కోర్టులో మంత్రి కొండాపై ‘పరువునష్టం’ విచారణ వాంగ్మూలం ఇచ్చిన నాగార్జున, సుప్రియరాజకీయ...

జానీమాస్టర్‌కి ఒక రూల్‌..యడ్యూరప్పకు మరో రూలా..?

జానీమాస్టర్‌ అవార్డును రద్దు చేసిన కేంద్రం..! కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన కర్ణాటక కాంగ్రెస్‌..!ప్రముఖ...

హరియాణలో ఖాతా తెరవని ఆప్‌..! పెద్ద గుణపాఠమన్న కేజ్రీవాల్‌.

హరియాణలో ఖాతా తెరవని ఆప్‌..!హరియాణ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఖాతా...

ఈడీ ఎదుట అజారుద్దీన్‌..! హెచ్‌సీఏ అవకతవకలపై విచారణ.

ఈడీ ఎదుట అజారుద్దీన్‌..! హెచ్‌సీఏ అవకతవకలపై విచారణమాజీ ఎంపీ, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు...

అభయని హత్యాచారం చేసింది సంజయ్‌రాయే : సీబీఐ

అభయని హత్యాచారం చేసింది సంజయ్‌రాయే..! కోర్టులో తొలి ఛార్జిషీట్ ప్రొడ్యూస్ చేసిన సీబీఐకోల్‌కతా...