హీరో నాగ చైతన్య, నటి శోభితా ధూలిపాళ్ల ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. వీరి నిశ్చితార్థం ఈ రోజు ఉదయం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ రోజు 8-8-8 స్పెషల్ డే కాబట్టి ఎంగేజ్ మెంట్ పెట్టుకున్నారు. త్వరలోనే వీరి వివాహం జరగనుంది.
నాగ చైతన్య, శోభిత ఎంగేజ్ మెంట్ ఫొటోలను నాగార్జున షేర్ చేశారు. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ తమ కుటుంబంలోకి శోభితను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సమంతతో పెళ్లై విడాకులు తీసుకున్నారు నాగ చైతన్య. శోభితతో కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు.