నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ మూవీ రిలీజ్ డేట్ పై ఓ న్యూస్ నెట్టింట తిరుగుతోంది. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. బన్నీ వాస్ నిర్మాత. దర్శకుడు చందూ మొండేటి రూపొందిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా రీసెంట్ గా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న తండేల్ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇదే జరిగితే చాలా వేగంగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లే అనుకోవాలి. పాకిస్థాన్ సైన్యానికి చిక్కిన తెలుగు జాలర్ల కథతో తండేల్ సినిమా ఉండనుంది. ఈ సినిమాలో హీరోయిజం, దేశభక్తి, లవ్ అండ్ ఎమోషన్ ను చూపించబోతున్నారు. ఇటీవల తండేల్ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.