నాగ చైతన్య హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ తండేల్ రిలీజ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ కు తీసుకురావాలని మేకర్స్ భావించారు. అయితే డిసెంబర్ లో బాక్సాఫీస్ వద్ద పోటీ ఎక్కువే ఉంది. అల్లు అర్జున్ పుష్ప 2, రామ్ చరణ్ గేమ్ ఓవర్, నితిన్ రాబిన్ హుడ్, మంచు విష్ణు కన్నప్ప లాంటి మూవీస్ అన్ని డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి.
చదవండి: 25 కోట్లు కట్టండి – బాలీవుడ్ క్రిటిక్స్ కు లీగల్ నోటీసులు
వీటిలో పుష్ప, రాబిన్ హుడ్ డేట్ అనౌన్స్ చేసుకోగా కన్నప్ప డిసెంబర్ రిలీజ్ అని ప్రకటించింది. గేమ్ ఛేంజర్ డిసెంబర్ రిలీజ్ అనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నాగ చైతన్య తన తండేల్ సినిమాను డిసెంబర్ నుంచి నెక్ట్ ఇయర్ కు పోస్ట్ పోన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తండేల్ రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారట. తండేల్ లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. గీతాఆర్ట్స్ నిర్మాణంలో దర్శకుడు చందూ మొండేటి రూపొందిస్తున్నారు.