ఫిబ్రవరి 7న ‘తండేల్’తో చైతూ రాక..!
100కోట్ల క్లబ్ ఖాయమంటున్న నిర్మాత..!
లవ్‌స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయి పల్లవి కాంబోలో వస్తున్న తదుపరి చిత్రం ‘తండేల్’. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, బన్నీ వాస్‌లు నిర్మిస్తున్న ‘తండేల్’కు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం కొద్దిపాటి చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నట్లుగా అధికారికంగా అనౌన్స్‌మెంట్ చేశారు మేకర్స్.
మొదట్లో ఈ చిత్రాన్ని డిసెంబరు 20న విడుదల చేయాలనుకున్నామని…అయితే ఇంకా కొద్దిపాటి బ్యాలెన్స్ షూట్ ఉండిపోయిందని, అయితే దీనికి కొన్నిచోట్ల పర్మిషన్స్ రావాల్సి ఉందని నిర్మాత బన్నీవాస్ తెలిపారు. ఇంకా 22 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉందన్న ఆయన…సీజీ టీమ్‌కు కూడా టైమ్ ఇవ్వాలి కనుక ఫిబ్రవరికి విడుదల చేస్తున్నామని వెల్లడించారు.
ఫిబ్రవరి 7న అక్కినేని అభిమానులకు కాలర్ ఎగరేసే సినిమా ఇవ్వడమే కాదు…తండేల్‌ను 100 కోట్ల క్లబ్‌లో జాయిన్ చేయడానికి కృషిచేస్తున్నామని నిర్మాత బన్నీవాసు అన్నారు. మా హీరోయిన్ సాయిపల్లవిని ఇప్పుడందరూ క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్ అంటున్నారు. నాగచైతన్య క్రేజ్‌కు తోడు సాయి పల్లవి లాంటి మహాలక్ష్మీ ఉండటం సంతోషంగా వుందంటూ సంతోషం వ్యక్తంచేశారు నిర్మాత బన్నీవాసు.