రజినీ తో నాగార్జున, రవితేజ

Spread the love

కోటానుకోట్లుగా ‘కూలీ’..?

సూపర్‌ స్టార్‌ రజీనీకాంత్, డైరెక్టర్‌ లోకేశ్ కనగరాజ్‌ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. భారీ ఎత్తున చేపడుతున్న ఈ ప్రాజెక్టును సన్‌పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఇతరభాష నటులను ఈ చిత్రంలో తీసుకుని సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్. కాగా, ఈ ఏడాది రజనీ నటించిన వేట్టైయాన్‌ చిత్రం అక్టోబర్‌ 10న రిలీజ్ అవుతుండగా, ఆ తర్వాత వస్తోన్న రజనీ చిత్రాల్లో కూలీ ప్రధానమైనది. దీనిని 2025లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

కూలీలో ‘కింగ్‌’..?

కూలీ పేరుతో వస్తున్న రజనీకాంత్ మూవీలో టాలీవుడ్‌ కింగ్ నాగార్జున ఉన్నట్టు సన్‌పిక్చర్స్‌ ప్రకటించింది. ఆగస్టు 29న మన్మథుడి బర్త్‌డే సందర్భంగా ఆయన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందులో నాగ్ పాత్రకు సంబంధించి లుక్ విడుదలచేసి అభిమానులతో పంచుకున్నారు. ఈ మోనోక్రోమ్ పోస్టర్‌లో ముదురు గడ్డం, మీసాలు…అలాగే షేడెడ్‌ సన్ గ్లాసెస్‌, గోల్డ్ వాచ్‌తో కూడిన నాగార్జునను చూసి ఆయన అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అయితే, ఇందులో ఆయన క్యారెక్టర్‌ రజనీకాంత్‌ను ఢీకొట్టే పాత్రని, అందులో నాగ్‌ పాత్ర పేరు సిమాన్‌ అని మూవీ టీమ్ ప్రకటించింది. భారీ అంచనాలతో కూడిన ఈ మూవీలో సీనియర్ నటులు చేరడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందంటూ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌ X వేదికగా పంచుకున్నారు.

చదవండి: నెట్ ఫ్లిక్స్ లో మొదలైన “బడ్డీ” సందడి

రజనీతో రవితేజ..?

ఇప్పటికే కూలీ సినిమాలో హీరో నాగర్జున పాత్రను రివీల్ చేసిన సన్‌పిక్చర్స్‌…మరో టాలీవుడ్‌ హీరో గురించి కూడా లీకులిచ్చింది. 171వ చిత్రంగా వస్తున్న రజనీకాంత్ చిత్రంలో నాగార్జునతోపాటు మాస్ మహరాజా రవితేజ యాక్ట్ చేస్తున్నట్లు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ కన్ఫామ్‌ చేశారు. అయితే రవితేజకు ఈ మధ్యకాలంలో జరిగిన ఓ షూటింగ్‌లో కుడిచేతికి గాయంకావడంతో ఆపరేషన్ చేసిన వైద్యులు…ఆరువారాలపాటు రెస్ట్‌లో ఉండాలని సూచించారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌…త్వరగా కోలుకుని కూలీ చిత్రంలో రవితేజ బిజీ అయిపోవాలని కాంక్షిస్తూ, ఈ మూవీ రూ.2వేల కోట్లు పక్కా అంటూ ట్వీట్ చేయడం విశేషం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే కన్నడ నటుడు ఉపేంద్ర, కన్నడ నటి రచితారామ్‌ ముఖ్యపాత్రల్లో పోషిస్తున్నారన్న వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.

Hot this week

దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత..

వైసీపీ మాజీ మంత్రికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్...

కుప్పంలో వైసీపీకి భారీ షాక్‌..! టీడీపీలోకి మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌..!

కుప్పంలో వైసీపీకి భారీ షాక్‌..! టీడీపీలోకి మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌..!కనీసం ప్రతిపక్ష...

పవన్ వ్యాఖ్యలతో టీడీపీలో అలజడి..!

పవన్ వ్యాఖ్యలతో టీడీపీలో అలజడి..! హోంశాఖ పనితీరు బాలేదన్న డిప్యూటీ సీఎం..!సొంత నియోజకవర్గం...

ఉత్తరాఖండ్‌లో ఘోరం..! బస్సు లోయలో పడి 36మంది శివైక్యం..!

ఉత్తరాఖండ్‌లో ఘోరం..! బస్సు లోయలో పడి 36మంది శివైక్యం..!కార్తీకమాసం తొలిసోమవారం దేవభూమి ఉత్తరాఖండ్‌లో...

అగ్రరాజ్యంలో మంగళవారమే పోలింగ్..!

అగ్రరాజ్యంలో మంగళవారమే పోలింగ్..!అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్‌డౌన్ స్టార్ట్‌ అయిపోయింది. మరికొన్నిగంటల్లో...

Topics

11నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జగన్ హాజరవుతారా?

ఈ నెల 11నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు బడ్టెట్‌ సమావేశాలకైనా జగన్ హాజరవుతారా?ఏపీ...

ఈ నెల 6న పోలీసుల ఎదుట సిద్ధరామయ్య..! సీఎంకు ‘ముడా’ ముప్పు.

కర్ణాటక సీఎంకు ‘ముడా’ ముప్పు..! ఈ నెల 6న పోలీసుల ఎదుట సిద్ధరామయ్య..!మైసూర్‌...

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీలేదన్న హోంమంత్రి అనిత

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీలేదన్న హోంమంత్రి అనితఏపీలో అత్యాచార ఘటనలపై హోంమంత్రి బాధ్యత...