నాగార్జున కెరీర్ లో ఫ్లాప్ సినిమాల్లో డాన్ ఒకటి. లారెన్స్ దర్శకత్వం వహించిన డాన్ సినిమా అపజయాన్ని మిగిల్చింది. మాస్ సినిమా చేసి సక్సెస్ ఇచ్చిన లారెన్స్ తో డాన్ అనే మరో సినిమా చేశాడు నాగార్జున. మొదటిసారి ఫలితం ఈసారి రివర్స్ అయ్యింది. ఇన్నేళ్ల తర్వాత ఈ డాన్ లో క్యారెక్టర్ మరోసారి కనిపించబోతున్నారు నాగార్జున.
రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో నాగార్జున కీ రోల్ చేస్తున్నారు. ఈ రోల్ డాన్ క్యారెక్టర్ అనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ మూవీని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం నాగార్జున పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే.. రజినీ మూవీలో నాగ్ అనగానే గెస్ట్ రోల్ అనుకున్నారు. ఆతర్వాత నెగిటివ్ షేడ్స్ ఉంటాయని ప్రచారం జరిగింది.
లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఫుల్ లెంగ్త్ రోల్ అని సమాచారం. మరి.. క్యారెక్టర్ ఏంటంటే.. నాగార్జున డాన్ క్యారెక్టర్ చేస్తున్నాడని తెలిసింది. ఈ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఇంకా రజినీ, నాగ్ మధ్య సీన్స్ స్టార్ట్ కాలేదట. త్వరలో వీరిద్దరి పై కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా నటిస్తున్నాడని వార్తలు వస్తుండడంతో మరింత క్రేజ్ పెరిగింది.