నాగార్జున హీరోగా నటిస్తున్న ‘నా సామిరంగ’ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమా ట్రైలర్ ను రేపు మధ్యాహ్నం 3.15 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ అనౌన్స్ మెంట్ సందర్భంగా ఓ పవర్ పుల్ యాక్షన్ పోస్టర్ రిలీజ్ చేశారు. మలయాళ సూపర్ హిట్ మూవీ రీమేక్ గా దర్శకుడు విజయ్ బిన్నీ రూపొందిస్తున్న ‘నా సామిరంగ’ సినిమా ఈ నెల 14న సంక్రాంతి సందర్భంగా థియేటర్స్ లోకి వస్తోంది.
ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరణ్, మిర్నా మీనన్, రుక్సర్ థిల్లాన్ కీ రోల్స్ చేస్తున్నారు. సంక్రాంతి మూవీస్ అన్నింట్లో చివరగా ట్రైలర్ రిలీజ్ అవుతున్న చిత్రమిదే. ఇప్పటికే వెంకటేష్ సైంధవ్, మహేశ్ గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్ ట్రైలర్ రిలీజ్ అయ్యాయి. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన కంటెంట్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ట్రైలర్ తో ‘నా సామిరంగ’ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.