మంత్రి సురేఖ మాటలపై నాగార్జున సీరియస్..?
తక్షణం వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ‘కింగ్’ పోస్ట్..!
సోషల్ మీడియాలో హీరో అక్కినేని నాగార్జున పోస్ట్ చేసిన ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖను ఉద్దేశిస్తూ ఆయన ఈ పోస్ట్ పెట్టడం విశేషం. ఎందుకంటే, తనపై ట్రోలింగ్ నేపథ్యంలో కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ బుధవారం నాడు మంత్రి కొండా సురేఖ మీడియా ముఖంగా ఫైర్ అయిన విషయం తెలిసిందే. చైతూ–సమంత విడిపోవడానికి కేటీఆర్‌నే కారణమని చెప్పడంతో అక్కినేని ఇంట్లో అలజడి రేగింది. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ అక్కినేని నాగార్జున ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
చదవండి: సమంత-చైతూ విడిపోవడానికి కేటీఆర్ కారణం: మంత్రి కొండా సురేఖ
గౌరవనీయులైన మంత్రి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ట్వీట్‌లో పేర్కొన్నారు అక్కినేని నాగార్జున. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖల జీవితాలని…మీ ప్రత్యర్థులను విమర్శించడానికి వాడుకోవద్దని హితవుపలికారు. దయుంచి సాటిమనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, అసంబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి..అంటూ మంత్రి కొండా సురేఖకు అక్కినేని నాగార్జున ట్వీట్‌లో పేర్కొన్నారు.