ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమా ట్రైలర్ ను నాగార్జున, వెంకటేష్ కలిసి రిలీజ్ చేశారు. సోషల్ మీడియా ద్వారా ట్రైలర్ రిలీజ్ చేసి ధనుష్ అండ్ టీమ్ కు బెస్ట్ విశెస్ అందజేశారు. ట్రైలర్ చూస్తే ధనుష్ వన్ మ్యాన్ షోగా సినిమా ఉంటుందని తెలుస్తోంది. బ్రిటీష్ కాలం నాటి అన్యాయాలపై ధనుష్ చేసిన పోరాటం ట్రైలర్ లో ఆసక్తి కలిగించేలా చూపించారు. ఇప్పటికే తెలుగు తప్ప మిగతా అన్ని లాంగ్వేజెస్ లో కెప్టెన్ మిల్లర్ రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు తెలుగులో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నెల 25న కెప్టెన్ మిల్లర్ థియేటర్స్ లోకి వస్తోంది.
ఈ సినిమా సంక్రాంతికి రావాల్సిఉండగా తెలుగు స్టార్స్ సినిమాల రష్ వల్ల వాయిదా పడింది. కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ రూపొందించారు. 1940 దశకపు బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ లో ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయిగా నటించగా..శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ ఇతర కీ రోల్స్ చేశారు.