టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తోన్న మూవీ కుబేర. ఇందులో కోలీవుడ్ స్టార్ ధనుష్ తో కలిసి నాగ్ నటిస్తున్నారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ మూవీకి డైరెక్టర్. అయితే.. నాగ్ నటించే కొత్త సినిమాను పుట్టినరోజున ప్రకటిస్తారని ప్రచారం జరిగింది కానీ.. అనౌన్స్ చేయలేదు. ఇంతకీ.. నాగ్ నెక్ట్స్ ఏంటి..?
ఈ సంవత్సరం సంక్రాంతికి నాగార్జున నా సామి రంగ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నిని నాగార్జున దర్శకుడిగా పరిచయం చేశారు. ఈ మూవీ సక్సెస్ మీట్ లో వచ్చే సంక్రాంతికి కలుద్దాం అన్నారు. ఈవిధంగా వచ్చే సంక్రాంతికి కొత్త సినిమాని రిలీజ్ చేయనున్నట్టుగా చెప్పకనే చెప్పారు. దీంతో ఎప్పుడెప్పుడు నాగ్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పుట్టినరోజున కొత్త సినిమా ప్రకటన వస్తుంది అనుకున్నారు కానీ.. ఇంత వరకు కొత్త సినిమాని అనౌన్స్ చేయలేదు.
చదవండి: “కేజీఎఫ్ 2” రికార్డ్ బద్దలు కొట్టిన “స్త్రీ 2”
నా సామి రంగ డైరెక్టర్ విజయ్ బిన్ని, సోగ్గాడే చిన్ని నాయనా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ.. ఈ ఇద్దరు దర్శకులు నాగార్జున కోసం కథలు రెడీ చేశారట కానీ.. ఈ రెండు కథలు నాగార్జునకు పూర్తి స్థాయిలో నచ్చలేదట. అందుకనే.. కొత్త సినిమాను ఇంత వరకు ప్రకటించలేదని తెలిసింది. మరో వైపు సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ మూవీలో నాగ్ నటిస్తున్నాడని.. పుట్టినరోజున ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ వస్తుందని ప్రచారం జరిగింది కానీ.. ఇంత వరకు దీనికి సంబంధించిన అప్ డేట్ కూడా లేదు. నాగ్ ప్రస్తుతం కుబేర మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నాగ్ బిగ్ బాస్ 8 షూట్ లో పాల్గొంటున్నారు. నాగ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషేష్ తెలియచేశారు. అయితే.. నాగ్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఎప్పుడు అనేది క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.