అంతా అనుకున్నట్లే నాగార్జున N కన్వెన్షన్ ను హైడ్రా నేలమట్టం చేసింది. గత పది రోజులుగా హైడ్రా హడావుడి నగరంలో మొదలైంది. చెరువులను ఆక్రమించి కట్టిన కట్టడాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఇది నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూడా చుట్టుకుంటుందని అంతా ఊహించారు. మీడియాలోనూ వార్తలు వచ్చాయి. అంతా అనుకున్నట్లుగానే హైడ్రా అధికారులు హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను ఈ ఉదయం కూల్చివేశారు.
చదవండి: టీపీసీసీ పగ్గాలు ఆయనకే..? త్వరలో అధికారిక ప్రకటన..!
చెరువును ఆక్రమించి ఈ కన్వెన్షన్ సెంటర్ కట్టారని హైడ్రా అధికారులు చెబుతున్నారు. చెరువులను ఆక్రమించి కట్టిన కట్టడాల కూల్చివేతకు ఇటీవల ప్రభుత్వం హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసింది. రంగనాథ్ అనే అధికారిని హెడ్ గా నియమించింది. చెరువుల ఎల్టీఎఫ్ పరిధిలో కట్టిన పర్మిషన్స్ లేని బిల్డింగ్స్ ను ఈ హైడ్రా కూల్చివేస్తోంది. ఇందులో భాగంగా 10 ఎకరాల్లో కట్టిన నాగార్జున ఎన్ కన్వెన్షన్ లో మూడున్నర ఎకరాలు చెరువును ఆక్రమించి కట్టారని హైడ్రా అధికారులు వెల్లడించారు. ఈ 3.5 ఎకరాల్లో కట్టడాలు కూల్చివేశారు. ఈ కన్వెన్షన్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, మ్యారేజ్ రిసెప్షన్ ఈవెంట్స్ జరుగుతుంటాయి.