సినిమా అనౌన్స్ మెంట్ రోజే రిలీజ్ డేట్ ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు హీరో నాని. ఆయన హిట్ 3 సినిమాను ఈరోజు ప్రకటించారు. సినిమా అనౌన్స్ మెంట్ తో పాటు రిలీజ్ డేట్ కూడా ఎప్పుడో చెప్పేశారు. వచ్చే ఏడాది మే 1న ఈ సినిమా థియేటర్స్ కు రాబోతోంది. మేకింగ్ మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఇలా సినిమా ప్రకటించిన రోజే రిలీజ్ డేట్ చెప్పలేరు. నాని దర్శకుడు శైలేష్ కొలను ప్లానింగ్ పై పూర్తి నమ్మకంతో ఉన్నట్లు దీంతో తెలుస్తోంది.
హిట్ 3 నాని నటిస్తున్న 32వ సినిమా. యునానమస్ ప్రొడక్షన్ తో కలిసి నాని తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ కు సక్సెస్ ఇచ్చిన ఫ్రాంఛైజీ హిట్. ఇప్పటిదాకా విశ్వక్ సేన్ హీరోగా హిట్, అడివి శేష్ హీరోగా హిట్ 2 సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు నాని అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్ తో హిట్ 3 చేస్తున్నారు.
చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన “డబుల్ ఇస్మార్ట్”
నాని గతంలో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వీ అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమా చేశారు. ఇందులో సైక్ కిల్లర్ గా నాని కనిపించారు. ఆ తర్వాత మళ్లీ నాని ఈ తరహా చిత్రాల జోలికి వెళ్లలేదు. ఎందుకంటే నాని కెరీర్ లో 25వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన వీ సినిమా ఫ్లాప్ అయ్యింది. దాంతో తన ఇమేజ్ కు తగిన కథలే చేస్తున్నారు నాని. మళ్లీ ఇప్పుడు హిట్ 3తో అదే రిస్క్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.