మలయాళ ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై నేచురల్ స్టార్, హీరో నాని ఆవేదన వ్యక్తం చేశారు. రిపోర్టులో తెలుసుకున్న విషయాలు తననెంతో బాధించాయని, తన హృదయం రెండు ముక్కలైపోయందని ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. తను చేసిన సినిమా షూటింగ్ సమయాల్లో ఇప్పటిదాకా ఇలాంటి అనుభవాల్ని చూడలేదన్న నాని…మెయిన్‌స్ట్రీమ్ సినిమా విషయాల్లో ఇలాంటివి జరగవని అనుకుంటున్నా అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. సినిమాల్లో రాణించాలని ఇండస్ట్రీకి వచ్చే మహిళలకు అనువైన పరిస్థితులు కల్పించాలని తెలిపారు.
చదవండి: నిర్మాతలకు కండీషన్స్ పెట్టిన పవర్ స్టార్
ఇదీ.. హేమ కమిటీ రిపోర్ట్..!
మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్నాళ్లు బతుకీడ్చాలంటే మహిళలు వీటిని ఎదుర్కోవాల్సిందే అంటూ జస్టిస్ కె.హేమ…తన విచారణలో ఎదురైన అనుభవాలను రిపోర్ట్ రూపంలో కేరళ సర్కార్‌కు అందించారు. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు, రెమ్యునరేషన్‌లో వ్యత్యాసాలు, షూటింగ్ టైమ్‌లో సరైన వసతులు చూపకుండా ఇబ్బందులు పెట్టడం, వారి వ్యక్తిగత గోప్యతను విస్మరించడం లాంటి అనేక సమస్యలతో మల్లువుడ్‌లో పనిచేసే మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నది హేమ నివేదిక సారాంశం.