నానిని ప్రొడ్యూసర్ గా సక్సెస్ ఫుల్ గా నిలబెట్టిన సినిమా హిట్. నాని వాల్ పోస్టర్ బ్యానర్ పై నిర్మించిన ఫస్ట్ సినిమా అ ఫ్లాప్ అయిన తర్వాత హిట్ సినిమా నిర్మించాడు. విశ్వక్ సేన్ హీరోగా కొత్త దర్శకుడు శైలేష్ కొలను హిట్ సినిమా ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
ఆ తర్వాత అడివి శేష్ హీరోగా రెండో సినిమా హిట్ 2 నిర్మించాడు నాని. ఇక థర్డ్ పార్ట్ లో తనే హీరోగా నటించబోతున్నాడు నాని. హిట్ 2 చివరలోనే థర్డ్ పార్ట్ ను రివీల్ చేశారు. తాజాగా హిట్ 3కి నాని మూహుర్తం పెట్టారు. వచ్చే నెల 5వ తేదీన హిట్ 3 సినిమా లాంఛనంగా ప్రారంభించబోతున్నారు.
చదవండి: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
ఈ సినిమాలో అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ గా నాని కనిపించనున్నారు. హిట్ , హిట్ 2 సినిమాలు సూపర్ హిట్స్ అయిన నేపథ్యంలో హిట్ 3పైనా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 5న లాంఛనంగా హిట్ 3 ప్రారంభించి..కొంత టైమ్ తీసుకుని ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు.