సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ పదే పదే చెబుతున్నా..ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఎక్కడో అనుమానంగానే ఉంది. పుష్ప 2 సినిమా దసరా రిలీజ్ కు వాయిదా పడుతుందనే టాక్ పోవడం లేదు. ఒకవేళ పుష్ప 2 సినిమా ఆగస్టు 15 రిలీజ్ డేట్ మిస్ అయితే దాన్ని అందుకునేందుకు నాని రెడీ అవుతున్నాడు.
నాని హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందిస్తున్న సరిపోదా శనివారం సినిమా షూటింగ్ స్పీడ్ గా జరుపుకుటోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా డీవీవీ దానయ్య ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. పుష్ప 2 రిలీజ్ వాయిదా పడితే అదే రోజున సరిపోదా శనివారం మూవీని రిలీజ్ కు తీసుకురావాలని ఈ మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.