నాని హీరోగా నటిస్తున్న సరిపోదా శనివారం సినిమా ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ లో చూపించిన మూవీ కాన్సెప్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. తన వాళ్లను ఎవరైనా ఏదైనా అంటే ఎవరికైనా కోపం వస్తుంది. కానీ కోపం వచ్చాక సమస్యతో ఉన్న ఎవరైనా తన వారే అనుకోవడం హీరో క్యారెక్టరైజేషన్ లో కొత్తదనం చూపిస్తోంది. సూర్య పాత్రలో నాని నటించిన ఈ మూవీలో యాక్షన్ ఎలిమెంట్స్ ప్రధానంగా ఉండబోతున్నట్లు ట్రైలర్ తో తెలుస్తోంది. సోకులపాలెం ఇన్స్ పెక్టర్ గా దయా పాత్రలో నటించాడు ఎస్ జే సూర్య.
చదవండి: నేడు తెలంగాణలో ఓపీ సేవలు బంద్..!
ఇన్స్ పెక్టర్ దయా ఎవరైనా చూసేందుకు కూడా భయపడేంత క్రూరంగా ఉంటాడు. అలాంటి ఇన్స్ పెక్టర్ దయాను ఢీ కొట్టేందుకు రెడీ అవుతాడు సూర్య. వీరి మధ్య ఘర్షణకు కారణాలు ఏంటి అనేది ట్రైలర్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. హీరో శనివారమే ఎందుకు కొడతాడు ఆదివారం కొట్టడా అంటూ విలన్ అడిగే ప్రశ్న మనకు కూడా నిజమే కదా అనిపిస్తుంది. దర్శకుడు వివేక్ ఆత్రేయ తన గత రెండు చిత్రాలకు భిన్నంగా యాక్షన్ ఓరియెంటెడ్ గా సరిపోదా శనివారం సినిమాను రూపొందించాడు. ఈ నెల 29న సరిపోదా శనివారం సినిమా థియేటర్స్ లోకి రానుంది.