సరిపోదా శనివారం’కు బ్రహ్మరథం పట్టి బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్ యూ: విజయ వేడుకలో నేచురల్ స్టార్ నాని
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా టీం విజయ వేడుక నిర్వహించింది. నిర్మాత దిల్ రాజు, దర్శకులు హను రాఘవపూడి, శివ నిర్వాణ, రాహుల్ సంకృత్యాన్ అతిధులుగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
చదవండి: ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్” డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో 20 న స్ట్రీమింగ్
విజయ వేడుకలో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ఈ రోజు ఇక్కడికి వచ్చిన నా పెద్ద ఫ్యామిలీకి ..లవ్ యూ ఆల్. థాంక్ యు సో మచ్. ఈ రోజు ప్రతి టీం మెంబర్ మనసు విప్పి సంతోషంగా మాట్లాడుతుంటే అది నిజమైన సక్సెస్ కి నిర్వచనం. ఈ వేడుక చూస్తుంటే మనసు నిండిపోయింది. చుట్టూ వరదలు వున్నాయి. చాలా మందికి కష్టంగా వుంది. ఇలాంటి పరిస్థితిలో సరిపోదా శనివారం ఆడియన్స్ కొంచెం రిలీఫ్ ఇచ్చింది. బయట చాలా గ్లూమీగా వుంది. కాసేపు మైండ్ దాని నుంచి తీసేయడానికి వాళ్ళందరికీ కొంచెం ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిదన్నది ఈ సినిమాకి దక్కిన బిగ్గెస్ట్ సక్సెస్. ఇలాంటి పరిస్థితిలో సినిమాకి బ్రహ్మరధం పట్టిన ఆడియన్స్ కి థాంక్ యూ. సినిమా సక్సెస్ అవుతుందని నమ్మాను. ఆ నమ్మకాన్ని నిజం చేసి చూపించారు. కేరళ ప్రమోషన్స్ కి వెళ్ళినప్పుడు ఆక్కడ ఓ టీ షర్టు ఇచ్చి సక్సెస్ ఈవెంట్ లో వేసుకోమని కోరారు. వారికి మాటిచ్చాను. ఆ మాటని నిలబెట్టుకున్నందుకు రిలీఫ్ గా వుంది. టీం అంతా పిచ్చిపిచ్చిగా కష్టపడి పని చేశారు. వివేక్ సిక్ అయిపోయినప్పుడు నేను కూడా రెండు రోజులు అసిస్టెంట్ డైరెక్టర్ లా పని చేశా. ఈ సక్సెస్ తెలుగు ప్రేక్షకులది. సరిపోదా శనివారం సక్సెస్ వివేక్ అకౌంట్ లో నే వేస్తున్నాను. జెర్సీలో అర్జున్ సక్సెస్ ఐతే సత్య రాజ్ ఎంత ఆనందపడతారో వివేక్ సక్సెస్ చూసి నేను అలానే ఆనందంపడుతున్నాను. అంటే సుందరానికీ అనే డ్రామా తీశాం. ఇప్పుడు యాక్షన్ ఎంటర్ టైనర్. మళ్ళీ కలసి పని చేసినప్పుడు కామెడీ తీద్దాం. ఆడియన్స్ సీట్లో పడిపడి నవ్వాలి. అది నా కోరిక. మళ్ళీ యాక్షన్ సినిమా చేస్తే జేక్స్ బిజోయ్ నే కావాలి. ఆడియన్స్ మ్యూజికల్ ట్రాన్స్ లో వున్నారు. మురళీ గారు, కార్తిక్ గారు సూపర్ గా వర్క్ చేశారు. ఎస్జే సూర్య గారి పెర్ఫార్మెన్స్ ని ఒక ప్రేక్షకుడిలా ఎంజాయ్ చేశా. ఆయన సినిమాని ఎంతగానో వోన్ చేసుకొని పని చేశారు. చారు గా ప్రియాంక అద్భుతంగా నటించింది. నిర్మాత గా కళ్యాణ్ ఫస్ట్ సినిమా ఇది. బ్లాక్ బస్టర్ కొట్టాడు. తను చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటున్నాను. చైల్డ్ ఎపిసోడ్ లో పని చేసిన పిల్లలు చక్కగా చేశారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. మీ అందరి కష్టం వల్లే సక్సెస్ ని ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. శనివారం మాత్రమే రెచ్చిపోయేవాడిని శనివారమోడు అంటారు. సినిమా నచ్చితే రోజూ రెచ్చిపోయేవాళ్ళని తెలుగు ప్రేక్షకులు అంటారు. థాంక్ యూ సో మచ్’ అన్నారు.
మూవీ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసిన శివ, హను అన్న, రాహుల్, దిల్ రాజు గారికి థాంక్ యూ. నాని సినిమాలో ఒక సీన్ ప్లే అవుతున్నపుడు ఆడియన్స్ థియేటర్స్ పేపర్స్ వేస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు. నాని గారు నన్ను అలా చూడాలని అనుకున్నారు. నాకు నామీద వున్న నమ్మకం కంటే నాని గారికి నా మీద వున్న నమ్మకం ఎక్కువ. ఇండస్ట్రీలో16 ఏళ్ళు పూర్తి చేసుకున్న నాని గారికి అభినందనలు. నాలుగేళ్ళుగా ఆయన్ని దగ్గర నుంచి చూస్తున్నాను. సినిమానే ఆయన ప్రాణం. సినిమాకి ఆయన ఇచ్చిన సపోర్ట్ మామూలుది కాదు. సినిమా కోసం అందరూ అహర్నిశలు కష్టపడ్డారు. ఈ సక్సెస్ కి టీం అందరిది. నా డైరెక్షన్ టీం అందరికీ పేరుపేరునా థాంక్ యూ. ఎడిటర్ కార్తిక్ కి థాంక్ యూ. లిరిక్ రైటర్స్ భరద్వాజ్, కేకే, కార్తిక్ కి థాంక్ యూ. నిర్మాత కళ్యాణ్ కి థాంక్. గట్టిగా కొట్టాం. నేను రాసిన దానికంటే అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన నాని గారు, సూర్య గారు, ప్రియాంక, సాయి కుమార్ గారు, అందరికీ పేరుపేరునా థాంక్ యూ. జేక్స్ బిజోయ్ సినిమా మరో స్థాయిలో నిలబెట్టాడు. శేఖర్ గారు అద్భుతమైన సెట్ వేశారు. నాని గారితో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని వుంది. నాని గారు మా అందరికీ చాలా ప్రౌడ్ గా ఫీల్ చేయిస్తున్నారు. థాంక్ యూ సో మచ్’ అన్నారు.
యాక్టర్ ఎస్జే సూర్య మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఎంతో ప్రేమించి మీ గుండెల్లో చోటిచ్చిన ఆడియన్స్ కి థాంక్స్ చెప్పడానికి ఈ వేడుకకు వచ్చాను. నిజానికి ఈ రోజు నాకు షూట్ వుంది. యూనిట్ కుదరదని చెప్పారు. అయితే ఈ రోజు అందరూ సెలవు తీసుకోండి ఖర్చు నేను భరిస్తాని చెప్పి వచ్చాను. నన్ను తెలుగు ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళిన నా డైరెక్టర్ వివేక్ ఆత్రేయకి ధన్యవాదాలు. సరిపోదా శనివారం ఒక మంచి మూవీ. వివేక్ గారు ఆంధ్ర క్వెంటిన్ జెరోమ్ టరాన్టినో. తను జీనియస్. ప్రతిది బ్రిలియంట్ గా తీశారు. తన రైటింగ్ కి హాట్సప్ ప్రియంక హాలీవుడ్ యాక్టర్ లా చేశారు. నాని గారిలో ఒక అమితాబ్ బచ్చన్ ని చూశాను. తను చెప్పిన ఒక్క డైలాగ్ ‘అడుగు’లో 16 ఏళ్ల అనుభవం కనిపించింది. నిర్మాత కళ్యాణ్ గారికి కంగ్రాట్స్. జేక్స్ బిజోయ్ బ్రిలియంట్ బీజీఎం ఇచ్చారు. నా గొంతులో వచ్చిన తెలుగులో జనాలు ఫీల్ అవ్వాలని సొంత గా డబ్బింగ్ చెప్పాను. జనాలు ఇచ్చిన ప్రేమకి అందరినీ హాగ్ చేసుకోవాలని వుంది. శనివారం వినాయక చవితి వస్తోంది. సెకండ్ వీక్ కూడా సినిమా అదిరిపోవాలి. టీం అందరికీ థాంక్ యూ. ప్రేక్షకుల ప్రేమకు థాంక్ యూ సో మచ్’ అన్నారు.
హీరోయిన్ ప్రియాంక మోహన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా అవకాశం ఇచ్చిన డివివి ఎంటర్‌టైన్‌మెంట్. థాంక్ యూ వివేక్. చారు పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎస్జే సూర్య గారి నుంచి చాలా నేర్చుకున్నారు. జేక్స్ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు. నాని నా ఫేవరట్. ఇండస్ట్రీలో 16 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు. ఆయనతో రెండు సినిమాలకి పని చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ థాంక్ యూ. ఇంత వర్షంలో కూడా సినిమానికి ఇంత గొప్ప సపోర్ట్ ఇచ్చినా ఆడియన్స్ కి థాంక్ యూ’ అన్నారు.
ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కంగ్రాట్స్. ఈ సినిమాకి గూస్ బంప్స్ మ్యూజిక్ ఇచ్చిన జేక్స్ కి కంగ్రాట్స్. వివేక్ లో మాస్ స్టయిలీ లీష్ యాక్షన్ ని నాని ద్వారా చూపించాడు. ఇంత రైన్స్ లో కూడా సినిమా డొమస్టిక్ గా 40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తొందరలోనే వరల్డ్ వైడ్ 100 కోట్ల కలెక్ట్ చేయబోతోంది. తొలి సినిమానే వందకోట్లు కలెక్ట్ చేస్తున్న నిర్మాతగా నిలిచి కళ్యాణ్ కంగ్రాట్స్. తెలుగులో 16 ఏళ్ళుగా ఇన్ని వేరియేషన్స్ ఇస్తున్న ఏకైక హీరో నాని. తను చాలా హార్డ్ వర్క్ చేసే హీరో. నేను లోకల్ నుంచి మా అసోషియేషన్ వుంది. సినిమా అంటే తనకి భయం భక్తి ప్రేమ. అదే తన సక్సెస్. సూర్య గారు ప్రతినాయకుడి పాత్రలో అద్భుతంగా నటించారు. రేపు గేమ్ ఛేంజర్ లో కూడా ఇలానే వుంటారు. గేమ్ ఛేంజర్ లో ఆయన గురించి కూడా పేపర్లు పడతాయి. ప్రియాంక చాలా క్యూట్ గా చేసింది. ఈ సినిమాని తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేయడానికి ఇచ్చిన దానయ్య గారికి థాంక్ యూ. ఈ ఎనర్జీతో గేమ్ ఛేంజర్ కి పని చేస్తాం’ అన్నారు
డైరెక్టర్ హను రాఘవపూడి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇండస్ట్రీలో16 ఏళ్ళు పూర్తి చేసుకున్న నాని గారికి అభినందనలు. ఈ 16 ఏళ్లలో రెండు జనరేషన్స్ మెమరీస్ లో వుండిపోయాడు. తనకి సినిమా అంటే భయం భక్తి ప్రేమ. అందుకే వరుసగా శ్యాం సింగారాయ్, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం లాంటి వైవిధ్యమైన సినిమాలు చేయగలుగుతున్నారు. నాని చాలా మందికి స్ఫూర్తి. సూర్య గారు విలన్ క్యారెక్టర్ ని సెలబ్రేట్ చేసుకునే నటించే యాక్టర్. తనకి హ్యుజ్ ఫ్యాన్ ని . వివేక్ ఆత్రేయ అంటే నాకు చాలా ఇష్టం. అంటే సుందరానికి నా ఫేవరట్ సినిమా. అందులో సీన్స్ ని అద్భుతంగా డీల్ చేశాడు. సరిపోదా కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. జేక్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. టీం అందరికీ కంగ్రాట్స్’ తెలిపారు.
డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ.. ఇంత గొప్ప సక్సెస్ అందుకున్న ‘సరిపోదా శనివారం’ టీంకు కంగ్రాట్స్. ఇలాంటి వర్షంలో కూడా ఇలాంటి కలెక్షన్స్ రావడం మామూలు విషయం కాదు. ఈ క్రెడిట్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయకి దక్కుతుంది. తన రైటింగ్ స్క్రీన్ ప్లే కి నాకు చాలా ఇష్టం. ఫిలిం ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది జేక్స్ బిజోయ్. మ్యూజిక్ అమెజింగ్. సూర్య గారు అద్భుతంగా వుంది. ఇంత గొప్ప సక్సెస్ అందుకున్న నాని గారికి కంగ్రాట్స్. అలాగే దసరాకి ఫిలిం ఫేర్ అందుకున్నందుకు, ఇండస్ట్రీలో 16 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు. 30 ప్లస్ సినిమాలు చేసి ఒక సంపూర్ణ నటుడిగా ఎదిగిన నాని గారి కెరీర్ నేను ఒక పార్ట్ అవ్వడం ఆనందంగా వుంది. నాని గారు లాంటి నటుడు తెలుగులో వుండటం గర్వంగా వుంది’ అన్నారు.
డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ…ఆడియన్స్ కి ఇంత గొప్ప ఎంటర్ టైన్మెంట్ ని అందిస్తూ ఇండస్ట్రీలో 16 ఏళ్ళు పూర్తి చేసుకున్న నాని గారికి కంగ్రాట్స్. సినిమాని ఎంత ప్రేమిస్తే సినిమా మనల్ని అంత ప్రేమిస్తుంది. నిన్ను కోరి మా కెరీర్ లో చాలా స్పెషల్. సరిపోదా శనివారంలో వివేక్ ఎంత కష్టపడ్డాడో సినిమా చూస్తే అర్ధమౌతుంది. తన కష్టానికి తగిన రిజల్ట్ వచ్చింది. చాలా సీన్స్ అంత గొప్ప ఎలా రాశాడో అనిపించింది. బ్రిలియంట్ వర్క్. ఎస్జే సూర్య గారి నటన చూసి ట్రాన్స్ లోకి వెళ్లాను. సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కంగ్రాట్స్’ చెప్పారు.
సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ మాట్లాడుతూ.. సినిమాకి ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ అన్ బిలివబుల్. నా కెరీర్ లో ఏ సినిమాకి రానంత రెస్పాన్స్ ఈ మూవీకి వచ్చింది. వివేక్ ఆత్రేయకి థాంక్ యూ. ఇండస్ట్రీలో 16 ఏళ్ళు పూర్తి చేసుకున్న నాని గారికి అభినందనలు. నాని గారి నటనకు నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన కథ ఎంపిక అద్భుతంగా వుంటుంది. ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడతారు. దయా గా సూర్య గారు ఎనర్జీ సూపర్బ్. ప్రియాంక చాలా గ్రేస్ ఫుల్ లో చేసింది. దానయ్య గారు గ్రేట్ విజన్ వున్న ప్రొడ్యూసర్. ఆయన బ్యానర్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది. నా మ్యూజిక్ టీంకి థాంక్. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’
యాక్టర్ అలీ మాట్లాడుతూ.. నాని గారికి, ఎస్జే సూర్య గారి, నిర్మాతలకు ధన్యవాదాలు. వివేక్ రూపంలో తెలుగు ఇండస్ట్రీకి గొప్ప డైరెక్టర్ వచ్చారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రేక్షక దేవుళ్ళు లేకపోతే మేము లేము. ఈ సందర్భంగా ప్రేక్షకులు కృతజ్ఞతలు’ తెలిపారు
యాక్టర్ శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ…దర్శక నిర్మాతలకి హీరో నాని గారికి అభినందలు. ఈ సినిమాని ఇంత గొప్పగా ఆదరించి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ తెలిపారు.
యాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను కాకుండా నా క్యారెక్టర్ కనిపించిందని ఫ్రెండ్స్ చెప్పారు. దీనికి కారణం డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. ఇది మా హ్యాట్రిక్. ఈ సినిమా నా మనసులో నిలిచిపోతుంది. దయా క్యారెక్టర్ లేనిదే నా క్యారెక్టర్ లేదు. సూర్య గారు సింపుల్ పర్శన్. చాలా స్వీట్ హార్ట్. సినిమాకి ఇంత గొప్ప విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ’ అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ విజయ వేడుక చాలా ఘనంగా జరిగింది.