నాని హీరోగానే కాదు ప్రొడ్యూసర్ గానూ సక్సెస్ అయ్యాడు. తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో హిట్ వంటి సక్సెస్ ఫుల్ సినిమా సిరీస్ చేశాడు. వాస్తవంగా హనుమాన్ సినిమా కూడా నిర్మాతగా నానికి దక్కాల్సిందే. అ..సినిమా ఫ్లాప్ తర్వాత ప్రశాంత్ వర్మను నాని నమ్మలేదు. నెక్ట్ కథ చెబుతానన్నా వినలేదు. దాంతో హనుమాన్ ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్ కు వెళ్లింది.
వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ కు హనుమాన్ దక్కి ఉంటే ఆ ప్రొడక్షన్ కు వంద కోట్లకు పైగా లాభం మిగిలేది. ఈ అనుభవంతో తన హిట్ ఫ్రాంఛైజీని మాత్రం వదలకూడదని ఫిక్స్ అయ్యాడు నాని. ఇప్పటికే ఈ సిరీస్ లో రెండు సినిమాలు రాగా మూడో సినిమా హిట్ 3 కి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో నానినే హీరోగా నటించబోతున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తారు. సైంధవ్ ఫ్లాప్ తో శైలేష్ క్రేజ్ తగ్గినా నాని మాత్రం హిట్ సిరీస్ లో మరో హిట్ తీస్తాడనే నమ్ముతున్నాడు.