తమిళ హిట్ రీమేక్ గరుడన్ చేసేందుకు రెడీ అవుతున్నారు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఈ ఏడాది తమిళంలో ఘన విజయాన్ని అందుకున్న సినిమా గరుడన్. ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో నారా రోహిత్ కనిపించనున్నారు. ఈ సినిమాకు నాంది డైరెక్టర్ విజయ్ కనకమేడల డైరెక్షన్ చేయబోతున్నారు.
చదవండి: జామ్ జంక్షన్ మ్యూజిక్ కాన్సెప్ట్ అదిరిపోతుంది – డైరెక్టర్ మారుతి
యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతోంది. గరుడన్ సినిమాను ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ మూల కథతో దర్శకుడు దురై సెంథిల్‌కుమార్ రూపొందించారు. ఈ చిత్రంలో సూరి, ఎం. శశికుమార్, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఏడాది మేలో రిలీజైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడీ రీమేక్ ను ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ గా తీసుకురాబోతున్నా బెల్లంకొండ.