నయనతార నటించిన రీసెంట్ మూవీ అన్నపూరణి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. గత నెల 29వ తేదీ నుంచి ఈ సినిమా ప్రీమియర్ జరుగుతోంది. అయితే ఈ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచేలా కథా కథనాలు ఉన్నాయంటూ కోర్టులో కేసు పడింది. దీంతో ఈ సినిమాను ఓటీటీ నుంచి తొలగించాలని మూవీ ప్రొడక్షన్ హౌస్ జీ స్టూడియోస్ నిర్ణయించింది. నెట్ ఫ్లిక్స్ నుంచి అన్నపూరణి సినిమాను తొలగించారు. ఇప్పుడీ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో లేదు.
అన్నపూరణి సినిమాలో జై, సత్యరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ట్రిడెంట్ ఆర్ట్స్, నాడ్ స్టూడియోస్, జీస్టూడియోస్ నిర్మాణంలో దర్శకుడు నీలేష్ కృష్ణ రూపొందించారు. గత నెల 1న అన్నపూరణి సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి చెఫ్ గా మారి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించడం, అక్కడ నాన్ వెజ్ వంటకాలు చేయాల్సిన సందర్భంలో ఎదురయ్యే సంఘర్షణ, కుటుంబ సభ్యులు అభ్యంతరాలు..వీటి మధ్య గొప్ప చెఫ్ కావాలనుకున్న అన్నపూరణి తన లక్ష్యాన్ని సాధించిందా లేదా అనే కథతో అన్నపూరణి సినిమా తెరకెక్కింది. ఈ అంశమే వివాదానికి కారణమవుతోంది.