ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా ఓటీటీ పార్టనర్ ను లాక్ చేసుకుంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ ఇవాళ సంక్రాంతి సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత దేవర నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ అవుతుందని ఆ ఓటీటీ పేర్కొంది. దేవర పండుగ ఆన్ నెట్ ప్లిక్స్ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది.
రీసెంట్ గా రిలీజ్ చేసిన దేవర గ్లింప్స్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ సాధిస్తోంది. రెండు భాగాలుగా దేవర సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఫస్ట్ పార్ట్ దేవర 1 ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న దేవరలో సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు.