రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి సితార్ సాంగ్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ లిరికల్ పాటలో ఉన్న హీరోయిన్ విజువల్స్ పై ఓ నెటిజన్ దర్శకుడు హరీశ్ శంకర్ కు కౌంటర్ ఇచ్చాడు. మీ హీరోయిన ముఖం చూపించకుండా బాడీ మాత్రం ఎక్స్ పోజ్ చేయిస్తున్నారు. హీరోయిన్ ను అశ్లీలంగా చూపిస్తున్నారు. పాతికేళ్ల భాగ్యశ్రీ భోర్సేను 56 ఏళ్ల రవితేజతో డ్యూయెట్స్, డ్యాన్సులు చేయిస్తున్నారు. అంటూ పోస్ట్ చేశాడు.
ఈ పోస్ట్ కు హరీశ్ శంకర్ స్పందిస్తూ మీ అబ్జర్వేషన్ కు నోబెల్ బహుమతి ఇవ్వాలి. మీరు కూడా ఇలాగే సినిమాలపై అశ్లీలంగా కామెంట్స్ చేస్తూ ఉండండి అంటూ రిప్లై ఇచ్చాడు. మిస్టర్ బచ్చన్ నుంచి సితార్ సాంగ్ ను ఫస్ట్ లిరికల్ సాంగ్ గా రిలీజ్ చేశారు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ రైడ్ తెలుగు రీమేక్ గా మిస్టర్ బచ్చన్ రూపొందుతోంది.