మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డ్ వచ్చినందుకు సినీ, రాజకీయ ప్రముఖులంతా అభినందిస్తున్నారు. పర్సనల్ గా వెళ్లి కలిసి సత్కరిస్తున్నారు. చిరంజీవి క్లోజ్ ఫ్రెంజ్ మోహన్ బాబు కూడా శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. నా స్నేహితుడు చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం దక్కినందుకు సంతోషంగా ఉంది. అతను ఈ పురస్కారానికి అన్ని విధాలా అర్హుడు అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై నెటిజన్స్ ట్రోల్స్ మొదలుపెట్టారు.
అసలు ఈ అవార్డ్ మొదట మోహన్ బాబుకే ఇవ్వాలనుకున్నారని, ఆయనే వదన్నాడని కొందరు. నీకు భారతరత్న అయితే కరెక్ట్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రధాని మోదీ నీ స్నేహితుడు అని చెబుతావు కదా ఆయనకు చెప్పి భారతరత్న తెచ్చుకో అని ఇంకొందరు రిప్లై ఇస్తున్నారు. లోపల మండుతున్నట్లు ఉంది అంటూ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలోని ప్రకాశ్ రాజ్ ఫొటో పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఏమైనా మంచు ఫ్యామిలీ ఏది చేసినా విమర్శలు రావడం కామన్ అయ్యింది.