హీరోయిన్ ఒక మనసు, సూర్యకాంతం వంటి చిత్రాల్లో నటించింది నాగబాబు కూతురు నిహారిక కొణిదెల. టీవీ కార్యక్రమాలకు, ఓటీటీ షోస్ యాంకరింగ్ చేసింది. ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారి ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా నిర్మించింది. ఈరోజు ఈ సినిమా రిలీజైంది. తాను నిర్మాతగా మారడం ప్లాన్ చేసింది కాదని, అనుకోకుండా ప్రొడ్యూసర్ అయ్యానని చెబుతోంది నిహారిక
నిహారిక మాట్లాడుతూ – కథ విన్నాక ఈ చిత్రంలో నా పేరు మాత్రం కనిపించాలని అనుకున్నాను. ముద్దపప్పు ఆవకాయ్ టైంలో నేను నటించాను. ఆ టైంలో నేను అందులో డబ్బులు కూడా పెట్టాను. అదే ప్రొడక్షన్ హౌస్ అయింది. కావాలని నిర్మాత అవ్వలేదు. అలా అయిపోయానంతే. నాకు నటించడమే ఇష్టం. టాలెంట్ మాత్రమే కాదు.. క్రమశిక్షణ ఉంటేనే ఇండస్ట్రీలో ఎదుగుతారని చిరంజీవి గారు చెబుతుంటారు. మంచి కథలు, కాన్సెప్ట్‌లు, స్క్రిప్ట్‌లకే ప్రాధాన్యం ఇస్తా. పాత్ర బాగుంటే మిగతా అంశాల గురించి అంతగా పట్టించుకోను. చిన్న పాత్ర అని, చిన్న హీరో అని కూడా ఆలోచించను. కథ బాగుండి.. పాత్ర నచ్చితే సినిమాల్లో నటిస్తాను. అని చెప్పింది.