రాజ్ తరుణ్, లావణ్య కేసులో ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తోంది. లాయర్ రాజేష్‌పై లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తనకు తెలియకుండానే డీజీపీకి రాజేష్ ఫిర్యాదు చేశాడాని లావణ్య చెప్పడం కేసులో కొత్త కోణంగా మారింది. కేసు టేకప్ చేస్తానని తనను రాజేష్ కలిశాడని తనను ఇబ్బంది పెడుతున్నాడని లావణ్య తాజాగా ఆరోపణలు చేసింది.
లాయర్ రాజేష్ పెడుతున్న ప్రెషర్ తో తీవ్ర ఒత్తడికి గురయ్యానని అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని లావణ్య చెప్పడం సంచలనంగా మారింది. రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రాతో కలిసి ఆమె సొంత ఊరైన మండీలో ఉన్నాడని లావణ్య చెబుతోంది. న్యాయపరంగా రాజ్ తరుణ్ పై పోరాటం చేస్తానని, అతనితో కలిసి ఉండాలనే ఇప్పటికీ అనుకున్నట్లు ఆమె చెప్పింది. తనకు కూడా సినిమాలంటే ఇష్టమని రాజ్ తరుణ్ సినిమాలను పాడు చేయాలనే ఉద్దేశం తనకు లేదని లావణ్య అంటోంది.