చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైమ్ తన మ్యారేజ్ లైఫ్ గురించి మాట్లాడింది నాగబాబు కూతురు నిహారిక కొణిదెల. పెళ్లి విషయంలో తాను కోరుకున్నట్లు జరగలేదని అందుకే చైతన్యతో విడిపోవాల్సి వచ్చిందని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆమె మాటలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం కెరీర్ మీద దృష్టి పెట్టింది నిహారిక.
హీరోయిన్ గా ప్రయాణం మొదలుపెట్టి, యాంకర్ గానూ వ్యవహరించింది నిహారిక..ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారి చిన్న సినిమాలు నిర్మించబోతోంది. నిహారిక మాట్లాడుతూ – పెళ్లి గురించి నేను చాలా ఊహించుకున్నా. అయితే వైవాహిక జీవితం విషయంలో నేను కోరుకున్నవి జరగలేదు. అందుకే విడాకులు తీసుకున్నాం. నా వయసు 30 ఏళ్లే. ఇంకా ప్రేమించే టైమ్ ఉంది. అయితే ఫస్ట్ నా కెరీర్ మీద దృష్టి పెట్టాలనుకుంటున్నా. ఆ తర్వాతే జీవిత భాగస్వామి గురించి ఆలోచిస్తా. అని చెప్పింది.