నాగబాబు పుత్రికోత్సాహంతో పులకరిస్తున్నారా…అవును ఏకంగా ఆయన ఇంట ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి మరీ… డాడీకి ఓ మూవీ హిట్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు నిహారిక. మెగా వారి ఆడపడచు చేసిన ఈ ప్రయత్నాన్ని తొలుత ఇండస్ట్రీ పెద్దలు లైట్ తీసుకోగా…చిన్న సినిమా, చిన్న నిర్మాత, చిన్నపాటి యాక్టర్స్ అంటూ కొట్టిపారేసిన ఈ సినిమానే ఇప్పుడు తోసిరాజంటూ పెద్దసినిమాలను పక్కనపెట్టిమరీ ప్రేక్షకానందం పొందుతోంది.
‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రం వసూళ్లలో తగ్గేదేలే అంటోంది.
కొణిదెల నిహారిక నిర్మాతగా, యధు వంశీ దర్శకత్వంలో గత 9న విడులైన ఈ సినిమా ప్రేక్షకులను హత్తుకుంది. అసలు ముఖ పరిచయమే లేని యాక్టర్లు, కనీసం పేరు కూడా తెలియని డైరెక్టర్ అయినా కూడా బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది.
చదవండి: మాజీ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు
విజయయాత్రలో కమిటీ కుర్రోళ్లు
తమకు లభించిన వియయంపై ప్రేక్షకులను నేరుగా కలిసి థ్యాంక్స్ చెప్పుకునేందుకు కమిటీ కుర్రోళ్లు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల బాటపట్టారు. ఊహించని విధంగా రాయలసీమలో వసూళ్ల బాగా రావడంపై చిత్రబృందం ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.
వసూళ్లతో షాక్ అయ్యా: నిర్మాత నిహారిక
ఇటీవల నంద్యాల, కర్నూలు థియేటర్లను సందర్శించిన నిహారిక…ప్రేక్షకులతో నేరుగా ముచ్చటించారు. విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూ రాయలసీమలో వస్తున్న ప్రజాదరణ, మైండ్ బ్లోయింగ్ అయ్యే వసూళ్లు తనను షాక్‌కు గురిచేశాయని ఆనందం వ్యక్తంచేశారు. కాగా, మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో వచ్చినా అక్కడి అభిమానుల ఆనందానికి అంతే ఉండదు, ఇదే క్రమంలో చిత్ర నిర్మాతగా నిహారిక రాకపై సంబరాలు చేసుకుంటూ ఆమెకు ఘనస్వాగతం పలకడం మరో విశేషం.