యంగ్ హీరో నిఖిల్ తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య పల్లవి శ్రీమంతం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోస్ ను నిఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమ దంపతులను బ్లెస్ చేయాల్సిందిగా నిఖిల్ పోస్ట్ చేశాడు. ఈ ఫొటోస్ కు కంగ్రాట్స్ చెబుతూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిఖిల్, పల్లవి 2022లో వివాహం చేసుకున్నారు. వారు ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారు. ప్రేమికుల నుంచి దంపతులుగా మారారు నిఖిల్, పల్లవి.
కెరీర్ పరంగా చూస్తే నిఖిల్ కార్తికేయ 2 తర్వాత చేసిన స్పై బౌన్స్ బ్యాక్ అయ్యింది. దాంతో మంచి పాన్ ఇండియా మూవీతో ఆడియెన్స్ ముందుకొస్తానని నిఖిల్ సారీ చెప్పాడు. ఇప్పుడు ఆయన స్వయంభు అనే భారీ బడ్జెట్ పీరియాడిక్ యాక్షన్ మూవీలో నటిస్తున్నారు. దర్శకుడు భరత్ కృష్ణమాచార్య ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం స్వయంభు రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.