నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభు మూవీ కొత్త షెడ్యూల్ మారేడుమిల్లి అడవుల్లో ప్రారంభమైంది. ఇక్కడి లొకేషన్స్ లో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ తో పాటు భారీ యాక్షన్ సీక్వెన్సులు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ సినిమాకు కీలకంగా ఉంటుందని మూవీ టీమ్ చెబుతున్నారు. స్వయంభు కోసం విదేశాలకు వెళ్లి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు నిఖిల్.
నిఖిల్ గత సినిమా స్పై ఫ్లాప్ కావడంతో ఈసారి హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. పాన్ ఇండియా మూవీగా స్వయంభును నిర్మిస్తోంది పిక్సెల్ స్టూడియోస్ సంస్థ. టాాగూర్ మధు ఈ చిత్రానికి సమర్పకులుగా ఉన్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా స్వయంభు సినిమా తెరకెక్కుతోంది.