నితిన్ హీరోగా దర్శకుడు వెంకీ కుడుముల రూపొందిస్తున్న సినిమా రాబిన్ హుడ్ అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఇవాళ ఈ సినిమా టైటిల్ రివీల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది వెల్లడించలేదు. టైటిల్ కాస్టింగ్ కార్డ్ లో నితిన్ ఒక్కడి పేరే ఉంది. ఈ సినిమాను రశ్మికతో బిగిన్ చేశారు. ఆ తర్వాత శ్రీలీల నటిస్తోందని చెప్పారు. అయితే ఇప్పుడదీ కన్ఫర్మ్ చేయడం లేదు. ఇక రాబిన్ హుడ్ సినిమా టైటిల్ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.
దొంగతనాలు చేస్తున్న నితిన్…భారతీయులంతా నా సోదరీసోదరీమణులు కాబట్టి నా బ్రదర్స్ సిస్టర్స్ దగ్గర డబ్బు తీసుకోవడం ఎలా నేరమవుతుంది. నేను నా వాళ్లని వాళ్ల జేబుల్లో చేతులు పెడుతుంటే..నా మీద కేసులు పెడుతున్నారంటూ ఫన్నీగా చెప్పాడు. దర్శకుడిగా రైటర్ గా వెంకీ కుడుముల సెటైర్స్ రాబిన్ హుడ్ లోనూ ఉన్నాయి. గతంలో నితిన్ తో భీష్మ అనే సూపర్ హిట్ సినిమా చేశాడీ దర్శకుడు. దాంతో ఈ కాంబినేషన్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ టైటిల్ గ్లింప్స్ తో హీరోను ఉన్నవాళ్లను దోచి పేదవాళ్లకు పంచే కాన్సెప్ట్ తో చూపించనున్నట్లు తెలుస్తోంది.