నితిన్ ఒకప్పుడు వరుసగా సక్సెస్ సాధించాడు కానీ.. ఇప్పుడు వరుసగా ఫ్లాప్స్ చూస్తున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అవే.. తమ్ముడు, రాబిన్ హుడ్. ఈ రెండు సినిమాల పై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. అయితే.. 12 సంవత్సరాల క్రితం వర్క్ చేసిన ఓ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు నితిన్ ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది. అలాగే ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు చేలు మారిందని తెలిసింది. ఇంతకీ.. నితిన్ ఎవరితో సినిమా చేయనున్నాడు..? ఈ ప్రాజెక్ట్ చేతులు మారడానికి కారణం ఏంటి..?
జయం, దిల్, సంబరం.. ఇలా కెరీర్ బిగినింగ్ లో వరుసగా విజయం సాధించి యూత్ దగ్గరయ్యాడు నితిన్. శ్రీఆంజనేయం, సై చిత్రాలతో కూడా మెప్పించాడు. అయితే.. ఆతర్వాత సరైన కథలు ఎంచుకోకపోవడం.. మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించడం వలన నితిన్ కి, సక్సెస్ కి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ఒకే ఒక్క ఛాన్స్ అన్నట్టుగా ఒక్క హిట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న టైమ్ లో విక్రమ్ కే కుమార్ నితిన్ తో ఇష్క్ అంటూ ప్రేమకథా చిత్రాన్ని తీశాడు. ఈ సినిమా కథ, కథనం యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఇక అప్పటి నుంచి నితిన్ కెరీర్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది. ఆతర్వాత చేసిన గుండెజారీ గల్లంతయ్యిందే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవ్వడంతో మరింత జోష్ గా సినిమాలు చేశాడు.
చిన్నదాన నీకోసం, కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాలు మెప్పించలేకపోయాయి. అప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేసిన అ ఆ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆతర్వాత భీష్మ హిట్ అయ్యింది.. రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి. ఇలాంటి టైమ్ లో విక్రమ్ కుమార్ నితిన్ కోసం ఓ కథ రెడీ చేశాడట. 2012లో వీరిద్దరి కాంబోలో ఇష్క్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత ఈ కాంబో సెట్ అయ్యిందని టాక్. అయితే.. ఈ మూవీని హనుమాన్ చిత్ర నిర్మాతలు నిర్మించాలి అనుకున్నారు కానీ.. బడ్జెట్ విషయంలో డిఫరెన్స్ రావడంతో ఈ మూవీని యు.వీ సంస్థ నిర్మిస్తుందని తెలిసింది. మరి.. ఇష్క్ తో బ్లాక్ బస్టర్ సాధించిన నితిన్, విక్రమ్ మరోసారి బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాలి.