నివేదా థామస్ నిన్న సోషల్ మీడియాలో ఇట్స్ బీన్ లాంగ్ టైమ్.. ఫైనల్లీ అంటూ లవ్ సింబల్ పెట్టి ఓ పోస్ట్ చేసింది. అంతా ఆమెకు పెళ్లి సెట్ అయ్యిందేమో…అదే విషయం చెప్పబోతోంది అనుకున్నారు. రీసెంట్ గా చాలా మంది సెలబ్రిటీలు చేసినట్లే సినిమా కోసం ఆమె ఈ ప్రకటన చేసింది. ఇవాళ ఆ సినిమా ప్రకటన వెలువడింది.
35 చిన్న కథ కాదు పేరుతో ఓ సినిమా చేస్తోంది నివేదా థామస్. ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ సినిమాలో ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీ రోల్స్ లో కనిపించనున్నారు. 35 చిన్న కథ కాదు సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రానా, సృజన్ యెరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు నంద కిషోర్ ఈమని రూపొందిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్స్ లోకి రాబోతోంది.