సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం నిన్న థియేటర్స్ లోకి వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆశించినంత సక్సెస్ అందుకోలేకపోయింది. ఫస్ట్ షో నుంచే గుంటూరు కారం సినిమాకు మిక్స్డ్ టాక్ మొదలైంది. ఈ డివైడ్ టాక్ లోనూ డే 1 కలెక్షన్స్ లో సత్తా చాటిందీ సినిమా. డే 1 నైజాంలో గుంటూరు కారంకు అదిరే వసూళ్లు దక్కాయి.
మొదటి రోజు 16 కోట్ల రూపాయలకు పైనే ఈ సినిమా నైజాంలో వసూళ్లు చేసిందని మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. ఇది మహేశ్ గత సినిమా సర్కారు వారి పాట కంటే ఎక్కువని చెబుతున్నారు. సంక్రాంతి సెలవులు ఉన్న ఈ నాలుగు రోజులు గుంటూరు కారం సినిమా వసూళ్లకు ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. కానీ హాలీడేస్ పూర్తయిన తర్వాత ఇప్పుడున్న టాక్ తో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం.