రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఓటీటీలో చూసేందుకు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ యానిమల్ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ నెల 26వ తేదీన యానిమల్ సినిమా ప్రీమియర్ కావాల్సిఉంది. అయితే ఈ సినిమా ప్రొడక్షన్ లో భాగమైన ఓ సంస్థ వేసిన కేసు వల్ల స్ట్రీమింగ్ కు ఆటంకం ఏర్పడింది.
ఇప్పటికి ఈ విషయంలో క్లారిటీ రాలేదు. కోర్టు కేసు ఈ నెల 18కి వాయిదా పడింది. యానిమల్ సినిమాకు తాము కూడా ఇన్వెస్ట్ చేశామని, సినిమాకు వచ్చిన లాభాల్లోంచి తమకూ వాటా కావాలని సదరు సంస్థ కేసు వేసింది. అయితే యానిమల్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ మాత్రం సదరు సంస్థకు ముందే సెటిల్ చేశామని, ఇప్పుడు లాభాల్లోంచి వాటా అడగడం సరికాదని అంటోంది.