పుష్ప 2 సినిమా ఆగష్టు 15 న రావాల్సింది కానీ.. డిసెంబర్ 6కు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే.. డిసెంబర్ 6న కూడా రావడం కష్టమే అంటూ ప్రచారం ఊపందుకుంది. ప్రచారంలో ఉన్న వార్తలకు బన్నీ, సుక్కు క్లారిటీ ఇచ్చారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ క్రిస్మస్ కు విడుదల అని దిల్ రాజు ఇటీవల అనౌన్స్ చేశారు. అయితే.. డేట్ ఎప్పుడు అనేది ప్రకటించలేదు. మరి.. నిజంగానే గేమ్ ఛేంజర్ క్రిస్మస్ కు వస్తుందా అనేది ఆసక్తిగా మారింది.
పుష్ప 2 సినిమా కోసం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ జనాలు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయం బాగా తెలుసు కాబట్టే సుకుమార్ అంచనాలకు మించి ఉండేలా చెక్కుతున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ ను చిత్రీకరిస్తున్నారు. అయితే.. బన్నీ, సుక్కు మధ్య విభేదాలు వచ్చాయని.. అందుకనే పుష్ప 2 అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ జరగడం లేదని.. డిసెంబర్ 6న కూడా రాదు.. వచ్చే సంవత్సరం సమ్మర్ లో పుష్ప 2 వస్తుందని టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా ప్రచారం జరిగింది. దీంతో ఇది నిజమా..? అనే డౌట్ క్రియేట్ అయ్యింది. ఈ డౌట్స్ అన్నింటికీ బన్నీ, సుక్కు క్లారిటీ ఇచ్చేశారు. దీంతో డిసెంబర్ 6న పుష్ప 2 రావడం అనే పక్కా అని క్లారిటీ వచ్చింది.
చదవండి: వైవాహిక బంధంలోకి హీరో కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్
ఇక క్లారిటీ రావాల్సింది గేమ్ ఛేంజర్ రిలీజ్ ఎప్పుడు అని. దిల్ రాజు గేమ్ ఛేంజర్ క్రిస్మస్ కు వస్తుందని ప్రకటించారు. అప్పటి నుంచి తండేల్ రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. కారణం ఏంటంటే.. అందరి కంటే ముందుగా తండేల్ డిసెంబర్ 20న రిలీజ్ అని ప్రకటించారు. గేమ్ ఛేంజర్ క్రిస్మస్ కు అని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి తండేల్ క్రిస్మస్ కు వస్తుందా… లేక సంక్రాంతికి వస్తుందా అనేది క్లారిటీ లేదు. ఈ మూవీ ఎనభై శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. రెండు పాటలు ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. తండేల్ మేకర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ డిసెంర్ లో రాకపోతే తండేల్ డిసెంబర్ 20న వస్తుంది. గేమ్ ఛేంజర్ వస్తే.. తండేల్ వాయిదాపడుతుంది. మరి.. ఏం జరగనుందో చూడాలి.