`చిత్రపురి కాలనీ సొసైటీ లో ఎలాంటి అవినీతి జరగలేదని అన్నారు సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్. ఈ రోజు ఆయన ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తన తోటి కమిటీ మెంబర్స్ తో పాటు ట్రెజరర్ పీఎస్ఎన్ దొరతో కలిసి ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు వల్లభనేని అనిల్ కుమార్. ఈ సందర్భంగా
వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ – చిత్రపురికాలనీ అభివృద్ధి కోసం మా కమిటీ పగలు, రాత్రి చాలా కష్టపడింది. కానీ కొందరు మెంబర్స్ కావాలనే మాపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం సొసైటీ 147 కోట్లరూపాయల డెఫ్‌షీట్‌లో ఉంది. సభ్యులు సకాలంలో సొమ్ములు చెల్లించక పోవడం వల్ల డెవలప్‌మెంట్ పనులు ఆగిపోతాయన్న భయంతో ఎస్.బి.ఐ నుంచి రుణాలు తీసుకుంది సొసైటీ. ఆ తర్వాత వాటిని తిరిగి కట్టలేని స్థితికి చేరుకుంది. ఆకారణంగా ఆక్షన్‌కు వెళుతుంటే కాపాడటానికి ఎంతప్రయత్నించామో అందరికీతెలిసిందే. చివరకు చదలవాడవారి సహకారంతో ఆ గండం నుంచి గట్టెక్కాము. మా పాలకవర్గం హయాంలో కేవలం 20 సభ్యత్వాలను మాత్రమే ఇచ్చాము. ట్విన్ టవర్స్ ప్రాజెక్ట్‌నుకూడా సొసైటీని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేయాలనే తపనతో చేపట్టిందే. ఇప్పటికి దానికి అప్లైచేసిన వారు 15మంది మాత్రమే. కానీ వందల కోట్ల అవినీతి జరిగింది అని ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి ప్రచారంవల్ల మన సొసైటీకే నష్టం జరుగుతుంది. అని అన్నారు.