హీరో విశాల్ తమిళ రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సోషల్ మీడియాలోనూ ఈ విషయం బాగా వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో స్పందించారు విశాల్. తనకు ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇందులో రాజకీయాల్లోకి తాను వస్తున్నానంటూ, రాజకీయ పార్టీ అనౌన్స్ చేస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు.
వారం రోజుల క్రితం హీరో విజయ్ పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేశారు. రాబోయో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించాడు. వారం రోజుల్లోనే విశాల్ కూడా పాలిటిక్స్ లోకి వస్తున్నారనే వార్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే విశాల్ ప్రకటనతో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. పలు సామాజిక ఇష్యూస్ పై విశాల్ స్పందించడం, చెన్నై వరదల సమయంలో బాధితులకు నిత్యావసరాలు అందించడం, తమిళ నటీనటుల సంఘం నడిగర్ కు అధ్యక్షుడిగా పనియడంతో ఆయన రాజకీయంగా అడుగు వేస్తారనే అంతా అనుకున్నారు.