చైతూ-శోభిత వెడ్డింగ్ ఓటీటీ రైట్స్ అంతా పుకార్లే..!
ఇటీవల సెలబ్రిటీలు తమ ఇంట్లో జరిగే శుభకార్యాలను ప్రముఖ ఓటీటీ సంస్థలకు అమ్మేస్తూ పరోక్షంగా క్యాష్ చేసుకుంటున్న సందర్భాలు కోకొల్లలు. ఈ క్రమంలోనే త్వరలో జరగబోయే నాగ్‌చైతన్య-శోభితల పెళ్లి ఓటీటీ రైట్స్‌ను రూ.50కోట్లకు నెట్‌ఫ్లిక్స్ చేజిక్కించుకుందన్న వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. దీంతో సర్వత్రా అక్కినేని అభిమానుల్లో చర్చ మొదలయింది. ఎందుకిలా చేస్తున్నారంటూ విమర్శలు కూడా మొదలైపోయాయి. అయితే, ఇరు కుటుంబాల నుంచి వచ్చిన పక్కా సమాచారంతో ఇదంతా వదంతులే అని తేలిపోయాయి. ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి చైతూ-శోభిత వెడ్డింగ్ రైట్స్ అమ్మలేదని కరాఖండీగా చెప్పడంతో అక్కినేని అభిమానులు ఊపిరిపీల్చుకున్నారట. లేకుంటే, నయనతార డాక్యుమెంటరీకి వచ్చినట్టు నెగిటివ్ కామెంట్స్ వచ్చే అవకాశం ఉండేదని భావించారట.
ఏదేమైనా, నాగ్‌చైతన్య-శోభిత వారి స్పెషల్ డేను ప్రైవేట్‌గా, పర్సనల్‌గా ఉంచాలని డిసైడ్ అవ్వడం అభిమానులకు ఆనందాన్నిచ్చింది. కాగా, చైతూ-శోభితల పెళ్లి అత్యంత ఘనంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో డిసెంబర్ 4న జరగబోతుంది. ప్రస్తుతం ఈ రెండు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీబిజీగా ఉన్నాయి.