గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం దేవర. ఈ సినిమా రిలీజ్ ముందు చాలా అనుమానాలు. ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల తీసిన సినిమా దేవర ఆకట్టుకుంటుందా..? రాజమౌళితో ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అవుతుందా..? లేదా… ఇలా ఎన్నో అనుమానాలు. అయితే.. అందరి అనుమానాలకు దేవర సమాధానం చెప్పాడు. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ రికార్డ్ కలెక్షన్స్ సాధించి బాక్సాఫీస్ దగ్గర దేవర హిట్ సినిమాగా నిలిచింది. తాజాగా 500 కోట్ల మార్క్ ను క్రాస్ చేయడం విశేషం.
ఇక అసలు విషయానికి వస్తే.. బాహుబలి 2 చిత్రం 16వ రోజు 3.50 కోట్లు కలెక్ట్ చేసి టాప్ లో ఉండేది. ఆ రికార్డ్ ను తాజాగా దేవర బ్రేక్ చేసింది. దేవర 16వ రోజు 3.65 కోట్లు కలెక్ట్ చేసి కొత్త రికార్డ్ సెట్ చేసింది. ఈ లిస్ట్ లో తర్వాత మూడు స్థానాల్లో హనుమాన్, ఆర్ఆర్ఆర్, ఎఫ్ 2 సినిమాలు ఉన్నాయి. 16వ రోజు హను-మాన్ కి 3.21కోట్లు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ కి 3.10 కోట్లు, ఇక ఎఫ్ 2 మూవీకి 2.56 కోట్లు వచ్చాయి. మొత్తానికి 16వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కలెక్షన్లను సాధించిన సినిమాగా దేవర నిలవడం విశేషం. దేవర ఇలా రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేయడంతో దేవర పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు పెరిగాయి.