ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా గ్లింప్స్ రికార్డ్ వ్యూస్ సాధిస్తోంది. నిన్న రిలీజైన ఈ గ్లింప్స్ 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. దేవర గ్లింప్స్ ఆడియెన్స్ కు బాగా రీచ్ అయ్యిందని మేకర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. గ్లింప్స్ లో ఎన్టీఆర్ లుక్, యాక్షన్ సీన్స్, డైలాగ్, గ్రాండ్ మేకింగ్ ఆకట్టుకున్నాయి.
రెండు భాగాలుగా దేవర సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఫస్ట్ పార్ట్ దేవర 1 ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతోంది. దేవర సినిమాను ఎక్కడా రాజీ పడకుండా, ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుని నిర్మించామని ఇటీవల నిర్మాత కల్యాణ్ రామ్ చెప్పారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న దేవరలో సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు.