ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ పైకి వచ్చేది అప్పుడే

Spread the love

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మూవీ దేవర. ఈ సినిమాతో పాటు వార్ 2 మూవీలో కూడా నటిస్తున్నాడు. అయితే.. దేవర, వార్ 2 ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే.. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఆగష్టులో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తామన్నారు కానీ.. ఇంత వరకు షూటింగ్ స్టార్ట్ కాలేదు. కారణం ఏంటి..? ఈ క్రేజీ మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?

ఎన్టీఆర్ దేవర షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. వార్ 2 షూటింగ్ లో పాల్గొన్నారు కానీ.. ఎన్టీఆర్ చేతికి గాయం అవ్వడం వలన బ్రేక్ ఇచ్చారు. త్వరలో ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవుతారు. టాలీవుడ్ హీరో ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కలిసి చేస్తోన్న వార్ 2 మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీని బ్రహ్మస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. త్వరలో రామోజీ ఫిలింసిటీలో ఈ మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. వచ్చే సంవత్సరం ఆగష్టులో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.

చదవండి: “కల్కి 2” రిలీజ్ ట్విస్ట్. అసలు ఏమైంది..?

ప్రశాంత్ నీల్ తో చేసే సినిమా అప్ డేట్ ఏంటంటే… ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఈ మూవీలో నటించే ఆర్టిస్టులు ఎవరెవరు అనేది ఫైనల్ చేస్తున్నారట. కథానాయికగా కైరా అద్వానీని ఫైనల్ చేసారని టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అక్టోబర్ నెలాఖరున లేదా నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ మూవీని సెట్స్ పైకి తీసుకురానున్నారని తెలిసింది. ఇందులో ఎన్టీఆర్ ను ఇంత వరకు ఎవరూ చూపించని విధంగా చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నారని సమాచారం. ఈ భారీ పాన్ ఇండియా మూవీని 2026లో జనవరి 9న రిలీజ్ చేయనున్నారు. మరి.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలిసి ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Hot this week

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో 30మందికిపైగా మావోలు మృతి.

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో అలజడి ఎదురుకాల్పుల్లో 30మందికిపైగా మావోలు మృతిమావోల కంచుకోటలో అలజడి రేగింది....

హర్షసాయి అజ్ఞాతం వెనుక పోలీసుల పాత్ర..?

హర్షసాయి అజ్ఞాతం వెనుక పోలీసుల పాత్ర..? హర్షసాయిపై బాధితురాలు మరో కంప్లైంట్‌..! ఇంతకీ...అత్యాచార ఆరోపణలు...

అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన కేజ్రీవాల్‌..

అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన మాజీ సీఎం..! కొత్త ఇల్లు చూసుకుని వెళ్లిపోయిన...

అధికారంలోకి వచ్చాక.. పవన్‌కు మతపిచ్చి పట్టుకుందన్న షర్మిల

అధికారంలోకి వచ్చాక పవన్ మారిపోయాడు పవన్‌కు మతపిచ్చి పట్టుకుందన్న షర్మిల తిరుపతి వారాహిసభ వేదికగా...

“దళపతి 69” మూవీ లాంఛ్

తమిళ హీరో దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు చేస్తున్న సినిమాగా...

Topics

“రాజా సాబ్” టార్గెట్ ఫిక్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న మూవీ ది...

నందిగం సురేష్‌కు హైకోర్టులో బెయిల్‌

వైసీపీ మాజీ ఎంపీకి బెయిల్‌..! నందిగం సురేష్‌కు హైకోర్టులో ఊరట..! గత ఐదేళ్ల జగన్‌...

ముందస్తు బెయిల్ కోసం సజ్జల..!

ముందస్తు బెయిల్ కోసం సజ్జల..! మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడికేసులో తాను అమాయకుడిని...