యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర. కొరటాల శివ తెరకెక్కించిన దేవర మూవీ అంచనాలకు మించిన సక్సెస్ సాధించింది. రాజమౌళితో సినిమా చేసిన హీరో నెక్ట్స్ మూవీ ఫ్లాప్ అవ్వడం అనేది సెంటిమెంట్ గా మారింది. ఈ సెంటిమెంట్ ప్రకారం దేవర ప్లాప్ అవుతుందేమో అనుకున్నారు కానీ.. ఆ సెంటిమెంట్ ను క్రాస్ చేసింది. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ భారీగా కలెక్షన్స్ సాధిస్తుండడం విశేషం. హిందీలో కూడా మంచి ఓపెనింగ్ రాబట్టింది. ఇంకా కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. ఇప్పుడు దసరా హాలీడేస్ కావడంతో మరింతగా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.
చదవండి: మళ్లీ వచ్చేది తానేనంటున్న జగన్..?
ఇదిలా ఉంటే.. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చేయాలని ప్లాన్ చేస్తే.. అభిమానులు భారీగా తరలి రావడంతో క్యాన్సిల్ అయ్యింది. దేవర బ్లాక్ బస్టర్ అయ్యింది కదా.. ఇప్పుడు సక్సెస్ సెలబ్రేషన్స్ భారీగా ప్లాన్ చేస్తారనుకుంటే.. ఇప్పుడు కూడా క్యాన్సిల్ అయ్యిందని సమాచారం. ఇంతకీ కారణం ఏంటంటే.. దేవీ నవరాత్రులు కారణంగా ఈవెంట్ నిర్వహించడానికి అనుమతులు ఇవ్వలేమని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్పాయని తెలిసింది. అయినప్పటికీ ఈ ఈవెంట్ ను నిర్వహించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నామని నిర్మాత నాగవంశీ తెలియచేశారు. ఈ సక్సెస్ ఈవెంట్ పై యంగ్ టైగర్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు.. పాపం ఇలా జరిగింది.