ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా ‘దేవర’. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
రీసెంట్‌గా ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు. ‘చుట్టమల్లె..’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్, అందులోని విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడీ, డాన్స్ మూమెంట్స్‌తో ఇంప్రెస్ చేస్తున్నాయి. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘దేవర’ను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ‘దేవర: పార్ట్ 1’ను పాన్ ఇండియా వైజ్ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నారు.