టాలీవుడ్ నుంచి మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రాబోతోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ప్రెస్టీజియస్ సినిమాకు ఈరోజు ముహూర్తం పెట్టారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ గతంలోనే అనౌన్స్ అయ్యింది. ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, ప్రశాంత్ నీల్, మైత్రీ ప్రొడ్యూసర్స్ నవీన్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. 2026 జనవరి 9న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఎన్టీఆర్ తో పీక్ స్టేజ్ యాక్షన్ చేయించనున్నారు ప్రశాంత్ నీల్.