పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేస్తూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఓజీ సినిమాను మాస్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్నారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవాళ రిలీజ్ చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ పై పవన్ స్టైలిష్ లుక్స్ లో ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు సగానికి పైగా కంప్లీట్ అయ్యింది. మిగతా షూట్ పవన్ ఏపీ ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత చేస్తారు. ఓజీ సినిమా టైటిల్ హంగ్రీ చీతాగా మారుస్తారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇవాళ రిలీజ్ చేసిన పోస్టర్ లో అదే ఓజీ టైటిల్ ఉంది. దీంతో టైటిల్ మార్చడం లేదని తెలుస్తోంది.