పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా టైటిల్ మార్చినట్లు తెలుస్తోంది. ఓజీ సినిమాను ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా పిలుస్తున్నారు. ఇదే సినిమా పేరని అంతా అనుకున్నారు అయితే ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమేనట. ఈ సినిమాకు హంగ్రీ చీతా అనే టైటిల్ రిజిస్టర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ పేరుతో రిలీజైన సాంగ్ ఛాట్ బస్టర్ అయ్యింది.
చాలా ఫాస్ట్ గా షూటింగ్ చేస్తూ వచ్చిన ఈ సినిమా పవన్ రాజకీయ కార్యక్రమాల వల్ల సడెన్ గా ఆగిపోవాల్సి వచ్చింది. ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాతే షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. ఈ సినిమాను దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సెప్టెంబర్ 27న హంగ్రీ చీతా సినిమాను రిలీజ్ చేస్తారని మేకర్స్ ప్రకటించారు.